TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇదో స్పై లవ్ స్టోరీ: ఎన్విడియో సీఈవోకు, అమెరికా గూఢచారితో లవ్ ఎఫైర్.!

Published on: Sat Nov 7, 2026 1:16PM

ప్రపంచ టెక్ రంగంలో అత్యంత ప్రభావమంతమైన వ్యక్తిగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  విప్లవానికి నాయకత్వం వహిస్తున్న ప్రముఖ చిప్ దిగ్గజం  ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ తాజాగా  హనీ ట్రాప్  వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు చైనా ప్రభుత్వానికి గూఢచారిగా వ్యవహరిస్తోందనే అనుమానాలున్న ఒక మహిళతో సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా నిఘా వర్గాలు సంచలన నివేదికను వెలువరించడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. టెక్ ప్రపంచంలో ఈ పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్ గా సంచలన చర్చగా మారింది. 

అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల    మెమో ప్రకారం, సింగపూర్‌కు చెందిన  మెగాస్పీడ్ అనే డేటా సెంటర్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఆలిస్ హువాంగ్ అనే చైనా మహిళతో జెన్సన్ హువాంగ్ కు లవ్ ఎఫైర్ ఉంది. వీరిరువురి మధ్యా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.  చైనా ప్రధాన నిఘా సంస్థ  మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ  ఈ మహిళను గూఢచారిగా రిక్రూట్ చేసుకుందని అమెరికా ఏజెన్సీలు చెబుతున్నాయి. అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లే ముందు ఈ నిఘా సమాచారాన్ని అమెరికా ప్రభుత్వంలోని కొద్దిమంది అత్యున్నత అధికారుల సమక్షంలో చర్చించినట్లు సమాచారం వెలువడింది.

అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఏడాది ప్రారంభంలో కొద్దిమంది ఉన్నతాధికారుల మధ్య ఒక రహస్య మెమో సర్క్యులేట్ అయింది. అందులో ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్‌కు, చైనాకు చెందిన వ్యాపారవేత్త అలిస్  హువాంగ్ లే తో సంబంధాలున్నట్లు పేర్కొన్నారు.  ఈ మేరకు  ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన కథనంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామం అమెరికా టెక్, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈ వివాదానికి ప్రధాన కారణం కేవలం వ్యక్తిగత సంబంధాలు మాత్రమే కాకుండా, అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలు కూడా ముడిపడి ఉండటమే. అమెరికా ప్రభుత్వం విధించిన కఠినమైన ఆంక్షలను ఉల్లంఘించి, ఎన్విడియా తయారుచేస్తున్న అత్యంత శక్తిమంతమైన ఏఐ చిప్స్ చైనాకు తరలుతున్నాయన్న ఆరోపణలపై మెగాస్పీడ్ కంపెనీపై ఇప్పటికే అమెరికా నిఘా పెట్టింది. చైనాకు చెందిన సంస్థలు ఆగ్నేయాసియాలోని డేటా సెంటర్ల ద్వారా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పొందేలా చేయడంలో ఈ నెట్‌వర్క్ సహకరించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి:  బంగారంతో ఆభరణాలే కాదు, రోడ్డు కూడా: దుబాయ్ లో గోల్డెన్ వాక్ వే.!

మరోవైపు  ఈ ఆరోపణలను ఎన్విడియా యాజమాన్యం  ఖండించింది. సీఈఓ హోదాలో జెన్సన్ హువాంగ్ ప్రతిఏటా వేలాది మంది కస్టమర్ ఎగ్జిక్యూటివ్‌లను కలుస్తుంటారని, అందులో భాగంగానే ఆలిస్ హువాంగ్‌ను కూడా కలిశారని పేర్కొంది. ఇవన్నీ కస్టమర్లతో జరిగే సాధారణ వ్యాపార సమావేశాలు మాత్రమేననీ, వాటిలో  జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి సున్నిత హస్యాలు,  ట్రేడ్ సీక్రెట్స్   పంచుకోలేదని ఎన్విడియా ప్రతినిధి తెలిపారు. మెగాస్పీడ్ కంపెనీ కూడా ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ, తాము ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదని, అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది.

అమెరికా,  చైనా  మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ల రంగంలో ఆధిపత్య పోరు  జరుగుతున్న తరుణంలో ఈ ఉదంతం తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్విడియా ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించినప్పటికీ, వాణిజ్య పరమైన సడలింపుల కోసం టెక్ దిగ్గజాలు  లాబీయింగ్ చేస్తున్నాయి.    

మీకు నచ్చవచ్చు:  వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్: ఉద్యోగుల తొలగింపునకు మైక్రో సాఫ్ట్ సరికొత్త వ్యూహం.!

ప్రేమ కోసం ఆస్తులన్నీ అమ్మేశాడు.. తీరా చూస్తే ప్రియురాలు మనిషే కాదు.!

[Nvidia CEO Jensen Huang Love Affair,  Chinese Spy Allegation, Alice Huang Megaspeed, US intelligence Memo, TeluguOne]