ఎన్టీఆర్ 'బాద్‌షా' మూవీ టాక్
posted on Apr 5, 2013 5:58PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'బాద్‌షా' ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. శ్రీనువైట్ల, ఎన్టీఆర్ కాంబినేషన్ కావడంతో, ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రిమియర్, మార్నింగ్ షో చూసిన వాళ్ళంతా సినిమా సూపర్ హిట్ అని అంటున్నారు. ఎన్టీఆర్ మూడు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. 'బాద్‌షా' లో ఎన్టీఆర్ చాలా అందంగా, ట్రెండీగా, ఫ్రెష్ గా కనిపించాడని అంటున్నారు. కొంతకాలంగా యంగ్ టైగర్ డాన్సులపై అసంతృప్తిగా ఉన్న అభిమానులకి ఈ సినిమా లోని డాన్సులు అలరిస్తాయని అంటున్నారు. నందమూరి అభిమానులకి ఈ సినిమా ఓ పండగా లాంటింది. ఈ సినిమాలో డిజైన్ చేసిన కొన్ని స్పెషల్ సీక్వెన్స్ లు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ జస్టిస్ చౌదరి గెటప్ లో వచ్చే సీక్వెన్స్ అదిరిపోయిందని అంటున్నారు. సెకండాఫ్ లో వచ్చే సంగీత్ ఎపిసోడ్ లో సీనియర్ ఎన్.టి.ఆర్ పాపులర్ మెలోడీ పాటలపై చేసిన సీక్వెన్స్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయట.