మెట్రో  వెయ్యి  ట్రిప్పులు  ఏ మూల‌కి?

ఇంటిల్ల‌పాదీ చిన్నా చిత‌కో ఉద్యోగ‌మో, వ్యాపార‌మో చేస్తేగాని ఇల్లుగ‌డిచే ప‌రిస్థితి లేదు. కాలం ఎంతో మారిపోయింది. పూర్తిగా క‌మ‌ర్షియ‌ల్ అయింది. ఏది కొన్నా కొండ‌చిలువ‌లా లాగేసుకుంటోంది గాని ఫ‌ర‌వాలేదు అనుకున్న ధ‌ర‌కు వ‌చ్చింద‌నేది లేదు. ఉద్యోగాల‌కోస‌మో, ప‌నికోస‌మో బ‌స్సులు, మెట్రో రైళ్ల ప్ర‌యాణాలు త‌ప్ప‌డం లేదు..ప్ర‌తీ ఏడూ ప్ర‌యాణీకుల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో ప్ర‌యాణీకులు స‌మ‌ యానికి గ‌మ్యాన్ని చేర‌లేక‌పోతున్నారు. బ‌స్స‌ల్లో వెళ్ల‌లేకపోతు న్నామ ని మెట్రో రైళ‌ల‌ను ఆశ్ర‌యించినా అంత‌గా పెద్ద ప్ర‌యోజ‌నం లేక‌పోతోంద‌న్న అభిప్రాయాలే వ్య‌క్త‌మ‌వు తు న్నాయి. మెట్రో రైళ్ల ట్రిప్పులు పెరిగినా అంత‌గా ప్ర‌యోజ‌నం లేక‌పోతోంది. బోగీలు ఎక్కువ లేక‌ పోవ‌డం ఒక్క‌సారిగా ఒక్క బోగీలో రెండు బ‌స్సుల జనం ఎక్కుతుండ‌డంతో ప్ర‌యాణీకుల క‌ష్టాలు బ‌స్సు క‌ష్టాల్ని త‌ల‌పిస్తున్నాయి! ప్ర‌స్తుతం వెయ్యి ట్రిప్పులు తిరుగుతున్నాయి, మూడు బోగీల్లో ప్ర‌యా ణీకు ల‌ను గ‌మ్యాల‌కు చేరుస్తున్నాయి. కానీ ఇది ఏమాత్రం ఉప‌యోగ‌క‌రంగా లేద‌న్న‌దే ప్ర‌యాణీకుల గోడు. బోగీల‌ను మ‌రిన్నిపెంచితేనే ప్ర‌యాణీకుల స‌మ‌యాన్ని ఆదా చేసిన‌వార‌వుతారు. ఇది మెట్రో రైల్వేవారు  దృష్టిలో పెట్టుకుని చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయాలే వ్య‌క్త‌మ‌వు తున్నాయి. 

ఎలాంటి అడ్డంకులు, స్టేజీల బెడ‌దా లేకుండా వీల‌యినంత త్వ‌ర‌లోనే గ‌మ్యానికి చేర‌డానికి చాలా మంది ఉద్యోగులు, ప‌నుల‌కు వెళ్లేవారు మెట్రోనే ఎక్కువ‌గా ఆశ్ర‌యిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ఈ మెట్రో ప్ర యాణీకుల సంఖ్యా పెరిగింది. న‌గ‌రంలో ఏద‌న్నా పండ‌గో,  పార్టీల హ‌డావుడి  జ‌రిగితే  ట్రాఫిక్  ఇబ్బందు ల‌తో బ‌స్సుల్లో ప‌డి వెళ్ల‌లేక‌నే మెట్రోని న‌మ్ముకుంటున్నారు. టికెట్ ధ‌ర ఎంత‌య‌నప్ప‌టికీ  వీల‌యినంత త్వ‌ర గా చేరిపోవ‌చ్చ‌న్న ఉద్దేశంతోనే బస్సుల‌ను వ‌దిలేసి మెట్రోల్లో వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. టికెట్ ఎక్కువా త‌క్కువా అన్న‌ది కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే, ఈ ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డానికి మెట్రో రైల్వేవారు ట్రిప్పుల సంఖ్య పెంచామ‌ని అంటున్నారు. దాని వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యాణీకుల‌కు క‌లిగే ప్ర‌యో జ‌నం లేద‌నే అనాలి. ట్రిప్పుల కంటే బోగీల సంఖ్య కూడా పెంచే ఆలోచ‌న చేయాలి. అదీ వీలు వెంట‌నే చేయ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. రైళ్లు వెంట వెంట‌నే ఉంటున్న‌ప్ప‌టికీ ఆఫీసులు, ప‌ను ల‌కు వెళ్లే సమ‌యంలో ఒక్క‌సారిగ ప్ర‌యాణీకుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది క‌నుక ట్రిప్పుల‌తో పాటు బోగీల సంఖ్య పెంచితే ఎంతో మేలు జ‌రుగుతుంద‌న్న‌ది ప్ర‌యాణీకుల మాట‌. సౌక‌ర్యం కంటే త్వ‌ర‌గా వెళ్ల‌డానికి ప్ర‌యాణీకులు ఇష్ట‌ప‌డుతున్న‌పుడు బోగీల సంఖ్య పెంచ‌డ‌మే ధ‌ర్మ‌మ‌వుతుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News