బడ్జెట్ పై ఆశల్లేవ్.. అంచనాల్లేవ్.. జైరాం రమేష్

 

కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ మరి కొద్ది సేపటిలో ప్రవేశ పెట్టనున్న వార్షిక బడ్జెట్ పై తమకు ఎలాంటి ఆశలూ లేవని కాంగ్రెస్ ఎంపీ జై రాం రమేష్ అన్నారు. కనీసం ఐటీ పన్ను విషయంలోనైనా మధ్యతరగతికి ఊరట కలిగిస్తారో లేదో చూడాలన్నారు.

 అలాగే ట్యాక్స్ టెర్రరిజం నుంచి పెట్టుబడి దారులకు ఏమైనా రిలాక్సేషన్ ఉంటుందో లేదో కూడా చూడాల్సి ఉందన్నారు. ఇక జీఎస్టీ విషయంలో కొన్ని సంస్కరణలు చేయాలని తాము డిమాండ్ చేశామన్న జైరాం రమేష్.. దానినైనా కేంద్రం పరిగణనలోనికి తీసుకుంటుందో లేదో తెలియదన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu