కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి అంటే?
posted on Dec 19, 2023 2:53PM
తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ పెండిగ్‌లో ఉన్న పనులపై దృష్టి సారించింది. ఈక్రమంలోనే.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కూడా రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాలు కూడా రూపొందించే పనిని ప్రారంభించింది. కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28 నుంచి అర్హులు అప్లై చేసుకోవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులను సరిచేయడానికి కూడా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈవిషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రేషన్ దుకాణము లో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు.