సైకిల్ పై ఆఫీస్‌కి వెళితే కి.మీ. కి 15 డాల‌ర్లు!

ఈ రోజుల్లో వాహ‌నాల రొద ఎక్కువైంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా మోటార్ వాహ‌నాలు తెగ వుప‌యో గిస్తున్నారు. ప‌ని వున్నా లేక‌పోయినా, బ‌డికి వెళ్లే వారూ చిన్న‌పాటి మోటార్‌సైకిల్ పైనే వెళుతున్నారు. వేగానికి  అతి ప్రాధాన్య‌త‌నిస్తున్నారేగాని దాని వ‌ల్ల వాతావ‌ర‌ణ కాలుష్యానికి అంతే కార‌కుల‌వుతున్నార‌న్న ధ్యాస మాత్రం వుండ‌డం లేదు. చాలాకాలం క్రితం మ‌న దేశంలో సైక్లింగ్ కీ ప్రాధాన్య‌త వుండేది. 

కాల క్ర‌మంలో వేగానికి పెద్ద పీట వేయ‌డం జ‌రిగింది. అన్ని ప‌నులు స‌త్వ‌రం కావాలంటే మోటార్ వాహ నాల ప్ర‌యాణ‌మే సుఖం అన్న అభిప్రాయానికి వ‌చ్చేయ‌డంతో వాటినే ఎక్క‌డికి వెళ్లాల‌న్న వుప‌యోగిం చ‌డం అల‌వాటైపోయింది. ప్ర‌స్తుతం మ‌న దేశంలో సైక్లింగ్ కేవ‌లం ఆరోగ్య సూత్రాల్లో ఒక‌టిగా మిగిలి పోయింది. ఇది వూహించ‌ని మార్పు. 

మ‌నం నెద‌ర్లాండ్స్ ప్ర‌భుత్వాన్ని చూసి ఎంతో నేర్చుకోవాలి.  అక్క‌డ ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వెళ్లేవారు సైకిల్ మీద వెళితే కిలోమీట‌ర్‌కి 15 డాల‌ర్లు ప్ర‌భుత్వం ఇస్తోందిట‌!  దేశంలో సైక్లింగ్‌కు ప్రాధాన్య‌త‌నీయా లని అక్క‌డ ప్ర‌భుత్వం ఆలోచ‌న చేసింది. అంతేకాక‌,  ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు కాసింత వారివంతు తోడ్ప డ‌టంలో ఇదో మార్గం ఎంచుకుంది. అంటే సైక్లింగ్ ద్వారా అక్క‌డి వారు వారానికి మ‌న లెక్క‌ల్లో రూ.300 సంపాదించే అవ‌కాశం ప్ర‌భుత్వం క‌ల్పించింది. అది టాక్స్ ఫ్రీ! 

సైకిలువాడ‌కం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వొత్తిడిని త‌గ్గిస్తుంది. న‌గ‌రాల్లో వాతావ‌రణ కాలుష్యాన్ని బాగా త‌గ్గిస్తుంది. ఈ కార‌ణాల‌వ‌ల్ల‌నే సైక్లింగ్‌ను ప్రమోట్ చేస్తున్నామ‌ని నెద‌ర్లాండ్స్ ప్ర‌భుత్వ మౌలిక స‌దుపాయాల మంత్రి వాల్దువెన్ అన్నారు. సైక్లింగ్‌ను ఉత్సాహ‌ప‌ర‌చ‌డం ద్వారా సంవ‌త్స‌రానికి వంద‌ల యూరోలు మిగులుతాయ‌న్నారు. ప్ర‌భుత్వానికి కూడా ఎంతో మేలు చేసిన‌ట్లేన‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌భుత్వం ఈ ప‌ర‌మైన గ‌ట్టి నిర్ణ‌యాల‌ను అమ‌లు చేయ‌డంలో ప్ర‌జ‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌ట్ల వారి వున్న ప్ర‌త్యేక దృష్టిని తెలియ‌జేస్తుంది. 

ఇలాంటి ఆలోచ‌న‌లు మ‌న దేశంలో అమ‌లుచేయ‌డానికి ప్ర‌భుత్వాల‌కు ఎవ‌రుచెప్ప‌గ‌లుగుతారు. రోజు రోజుకూ పెరిగిపోతున్న కాలుష్యానికి ఫుల్‌స్టాప్ పెట్ట‌డానికి సైక్లింగ్ విధానాన్ని మ‌న ప్ర‌భుత్వాలూ చేప‌డితే మేలు. కాలుష్య నివార‌ణ‌, ప్ర‌మాదాల నివార‌ణ‌కూ సైక్లింగ్ని ఉత్సాహ‌ప‌ర‌చాలి. నెల‌లో క‌నీసం కొన్ని రోజులు కార్యాల‌యాలకు సైకిల్ మీద రావాల‌ని గ‌ట్టి నిబంధ‌న‌ను అమ‌లుచేయ‌డానికి పూనుకోవాలి. అపుడు నెద‌ర్లాండ్స్ వ‌లె మ‌న దేశంలోనూ ప్ర‌జారోగ్యం, ప‌ర్యావ‌ర‌ణ‌ప‌రిర‌క్ష‌ణ ప‌ట్ల  ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెరుగు తుంది.