ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరడానికి అన్ని లాంఛనాలూ పూర్తయ్యాయి. మంగళవారం (జూన్ 11) ఉదయం విజయవాడ  ఏ కన్వెన్షన్ సెంటర లో జరిగిన ఎన్డీయే కూటమి శాసన సభ్యుల సమావేశం కూటమి శాసనసభాపక్ష నేతగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంది. తొలుత చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. 

ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా తనను ఎన్నుకున్నందుకు చంద్రబాబు సభ్యులకు కృతజ్ణతలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ధృఢ సంకల్పంతో ప్రజలు చొరవ చూపి కూటమికి అఖండ విజయాన్ని అందించారని ఆయన పేర్కొన్నారు. ప్రజాతీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు అన్నారు.  అత్యున్నత ఆశయాల కోసం మూడు పార్టీలూ ఏకమయ్యాయన్నారు. ఈ విజయంలో పవన్ కల్యాణ్ కృషిని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు.

జనసేన అధినేత ఈ ఎన్నికలలో వంద శాతం ఫలితాలు సాధించారని చెప్పరు. 21 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసిన జనసేన ఆ 21 స్థానాలలోనూ విజయం సాధించిందని చెప్పారు. అసెంబ్లీలో విపక్ష హోదా కూడా దక్కనంత ఘోరమైన ఓటమిని జనం వైసీపీకి ఇచ్చారని చెప్పిన చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలకు వేదికగా ఏపీ అసెంబ్లీ నిలవాలని ఆకాంక్షించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News