జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా అలోక్ జోషి
posted on Apr 30, 2025 2:12PM

కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత సలహా బోర్డును ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డు ఛైర్మన్‌గా మాజీ రా అండ్ రా చీఫ్ అలోక్ జోషిని ఛైర్మన్‌గా నియమించారు. జాతీయ భద్రతా విషయాల్లో అనుభవం ఉన్న అలోక్ జోషి నాయకత్వంలో ఈ బోర్డు దేశ భద్రతా వ్యూహాలను మరింత బలోపేతం చేయనుంది. ఈ బోర్డులో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు, వీరంతా తమ రంగాల్లో అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారులు.
సైనిక సేవల నుంచి రిటైరైన మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా ఈ బోర్డులో సభ్యులుగా నియమితులయ్యారు. వీరి సైనిక నైపుణ్యం, వ్యూహాత్మక దృష్టి బోర్డు నిర్ణయాలకు బలాన్ని చేకూర్చనుంది. ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి రిటైరైన రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్ కూడా బోర్డు సభ్యులుగా ఎంపికయ్యారు. వీరు దేశీయ భద్రత, లా అండ్ ఆర్డర్ విషయాల్లో తమ అనుభవాన్ని అందించనున్నారు.