పెను తుపాను తలొంచి చూసే తొలి నిప్పుకణం: చంద్రబాబుకు జాతీయ స్థాయిలో ప్రశంసలు.!
Published on: Tue Nov 10, 2026 4:19PM

ప్రకృతి ప్రకోపాన్ని ఎవరూ ఆపలేరు. అయితే.. పక్కా ప్రణాళిక, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రాణ, ఆస్తి నష్టాలను ఏ విధంగా తగ్గించవచ్చు. ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతల్లో చూపారు. రాష్ట్రంపై రోజుల వ్యవధిలో విరుచుకుపడిన రెండు పెను తుపాన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరుపై జాతీయ స్థాయిలో చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రెండు పెను తుపానులను అత్యంత సమర్థంగా ఎదుర్కొని ప్రాణ నష్టాన్నికనిష్ట స్థాయికి తగ్గించడమే కాకుండా, తుపాను ప్రభావిత ప్రాంతాలలో సహాయ పునరావాస చర్యలను అత్యంత వేగంగా, కచ్చితత్వంతో చేపట్టిన తీరు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరించిన విపత్తు నిర్వహణ విధానాలు, టెక్నాలజీ ఆధారిత నిర్ణయాలు భారీ నష్టాన్ని తప్పించాయని విమర్శకులు సైతం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రంలో కేవలం ఆరు రోజుల వ్యవధిలో రెండు భారీ తుఫాన్లు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. అక్టోబర్ 28న నరసాపురం సమీపంలో అర్నాబ్' తుఫాను, నవంబర్ 3న ఒంగోలు సమీపంలో మురసు తుఫాను తీరం దాటాయి.
ఈ రెండు పెను తుఫాన్ల కారణంగా రాష్ట్రంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. లక్షలాది ఎకరాలలో పంటలు నీట మునగడంతో పాటు వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, రహదారులు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ముందస్తుగా చేపట్టిన పకడ్బందీ చర్యలు, వేగవంతమైన సహాయక బృందాల మోహరింపు వల్ల ఎలాంటి ప్రాణనష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించగలిగారు.
.webp)
ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు నాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ( కేంద్రాన్ని ప్రధాన సమన్వయ కేంద్రంగా మార్చారు. స్వయంగా ఆర్టీజీఎస్ కేంద్రం నుంచే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, జిల్లా కలెక్టర్లు, శాఖాధిపతులతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. మొదటి తుఫాను సమయంలో 32 వేల మంది అధికారులు, రెండో తుఫాను సమయంలో 45 వేల మంది క్షేత్రస్థాయి సిబ్బందిని ఒకే వ్యవస్థ కిందకు తీసుకువచ్చి సమన్వయం చేశారు. గ్రామ సచివాలయాల సిబ్బంది నుంచి ఉన్నత అధికారుల వరకు అందరినీ భాగస్వాములను చేశారు.
ఇది కూడా చదవండి: మురసు తుఫానుతో ఏపీకి రూ.1,918 కోట్ల నష్టం.!
ఈ విపత్తు నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, శాటిలైట్ మ్యాపింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను ప్రభుత్వం విస్తృతంగా ఉపయోగించుకుంది. తుఫాను కదలికలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు, ప్రమాదం అంచున ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాకపోకలు నిలిచిపోయిన ప్రాంతాలను గుర్తించడానికి డ్రోన్లను వాడగా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహకారంతో వరద నీటి మ్యాపింగ్‌ను చేపట్టి సహాయక చర్యలను వేగవంతం చేశారు.
ప్రజలను అప్రమత్తం చేయడంలో మొబైల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్, సెల్ బ్రాడ్కాస్ట్ విధానాల ద్వారా ఈ రెండు తుఫాన్ల సమయంలో ఏకంగా 14 కోట్లకు పైగా మొబైల్ అలర్ట్‌లను ప్రజలకు పంపించారు. ఎస్ఎమ్ఎస్, వాయిస్ మెసేజ్‌లు, టెలివిజన్ మాధ్యమాల ద్వారా మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించడంతో పాటు, రైతులకు పంటల రక్షణపై సలహాలు అందించారు.
.webp)
తుఫానుల కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడంలోనూ ప్రభుత్వం చొరవ చూపింది. కేవలం రాష్ట్ర సిబ్బందిపైనే కాకుండా, పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని విద్యుత్ సిబ్బందిని, అవసరమైన యంత్రసామగ్రిని రప్పించి పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. విపత్తు వేళ సమర్థవంతమైన నాయకత్వం, టెక్నాలజీ జోడింపు ఏ విధంగా ఫలితాలను ఇస్తాయో ఏపీ ప్రభుత్వం నిరూపించిందని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
మీకు నచ్చవచ్చు: సీఎం చంద్రబాబుకు పీఎం మోడీ ఫోన్: తుపాన్ల నష్టంపై ఆరా.!
తీరం దాటిన మురసు: బాపట్లలో వర్ష బీభత్సం: తెల్లవారు జామున చంద్రబాబు సమీక్ష.!
[Nation Praises Chandrababu Naidu, Cyclone Management Technology, Real Time Governance, AP Cyclones, AI, Drones, Disaster Management, AP Government Cyclone Rescue, Telugu One]


