TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం చంద్రబాబుకు పీఎం మోడీ ఫోన్: తుపాన్ల నష్టంపై ఆరా.!

Published on: Wed Nov 4, 2026 2:17PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన అర్నాబ్, మురసు తుపానుల కారణంగా సంభవించిన నష్టంపై ఆరా తీశారు. వరుస తుపానులు ఏపీపై విరుచుకుపడిన సంగతి విదితమే. మోడీ ఫోన్ లో తుపానుల వల్ల సంభవించిన నష్టం వివరాలకు అడిగి తెలుసుకున్నారు.  రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితులు, తుఫానుల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల వివరాలను  ఈ సందర్భంగా చంద్రబాబు  ప్రధానికి  వివరించారు. రోజుల వ్యవధిలోనే రెండు పెను తుపానులు  రాష్ట్రాన్ని తాకడంతో సంభవించిన ఆస్తినష్టం వివరాలను చంద్రబాబు మోడీకి వివరించారు.

అర్నాబ్, మురసు తుపానుల కారణంగ ఏపీ వ్యాప్తంగా  పలు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసాయనీ, దానికి తోడు బలమైన ఈదురు గాలులు బీభత్సం సష్టించాయనీ చెప్పారు.  కోనసీమ తదితర ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, వేలాది విద్యుత్ స్తంభాలు నేలకూలాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు.

ఈ తుఫానుల కారణంగా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు సాగు చేసిన పంటలు నీట మునిగిపోవడంతో రైతన్నలు భారీగా నష్టపోయారనీ, అలాగే  ఉద్యానవన పంటలు, ఆవాస ప్రాంతాలు దెబ్బతినడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బట్లను ప్రధానికి వివరించి, తక్షణ సహాయక చర్యల గురించి ప్రస్తావించారు. కష్టకాలంలో   ఆంధ్రప్రదేశ్ కు  కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.  


[PM Modi Call Chandrababu Naidu,  Arnab, Murasu, Cyclones, Damage, AP Cyclones,  Center Assistance, Telugu One]