TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తీరం దాటిన మురసు: బాపట్లలో వర్ష బీభత్సం: తెల్లవారు జామున చంద్రబాబు సమీక్ష.!

Published on: Tue Nov 3, 2026 6:57AM

మురసు తుపాను తీరం దాటింది.  మంగళవారం (నవంబర్ 2)అర్ధరాత్రి దాటిన  బుధవారం తెల్లవారు జామున (దాదాపు ఒంటింట ప్రాంతంలో  తుఫాన్  ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకింది. ఆరున్నర గంటలకల్లా పూర్తిగా తీరాన్ని దాటింది. తుపాను ప్రభావంతో  బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. , రేపల్లె, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి.  పలు చోట్ల చెట్లు కూలాయి.  అలాగే కృష్ణా జిల్లా  అవనిగడ్డ, నాగాయలంక, , గుంటూరు జిల్లాల్లో కూడా కుండపోత వర్షం కురుస్తోంది.  ఎన్టీఆర్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందన్న అంచనాలతో పలు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

అదలా ఉంటే.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెల్లవారు జామున మూడున్నర గంటలకు తుపాను తీవ్రత, వర్షాలు, నష్టం, సహాయక చర్యలపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.   తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి రాకుండా చూడాలని ఆదేశించారు.  సీఎం చంద్రబాబు సోమవారం నుంచి దాదాపుగా ఆర్టీజీసీలోనే ఉంటూ తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షంచారు.   రాత్రి 10 గంటలకు ఒకసారి, తెల్లవారుజామున మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడమే కాకుండా, ప్రతి గంటకు అధికారుల నుంచి సమాచారం తీసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షించారు.  

[Murasu Cyclone Land Fall, Heavy Rains, Bapatla, repalle, CBN, reciew, Telecinference, Telugu One]