TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దేశ గౌరవపతాక: జాతీయ జెండా: మోడీ చర్య పట్ల దేశం అందరూ ఫిదా.!

Published on: Thu Nov 19, 2026 10:37AM

అంతర్జాతీయ వేదికలపై  జాతీయ జెండాపై తనకున్న అపారమైన గౌరవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి చాటుకున్నారు. ఇటీవల ఫిలిప్పీన్స్ రాజధాని మానిలాలో జరిగిన క్వాడ్   నేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చోటుచేసుకున్న ఒక చిన్న సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సమావేశంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రూప్ ఫోటో సెషన్‌లో ప్రధాని మోదీ   నిరాడంబరత,  దేశభక్తి   అందరినీ ఆకట్టుకుంది.

ఆసియాన్ సదస్సు,  క్వాడ్ సమావేశాల నేపథ్యంలో వివిధ దేశాల అధినేతలు పాల్గొనే ఫోటో  సెషన్ కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాయకులు ఎక్కడ నిలబడాలో సూచించేందుకు వీలుగా నేలపై వేర్వేరు దేశాల జాతీయ జెండాల గుర్తులు,  నేమ్ కార్డ్స్‌ ఉంచారు. ఆ ప్రాంతానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, తన స్థానానికి సమీపంలో నేలపై పడి ఉన్న భారత త్రివర్ణ పతాకపు గుర్తును గమనించారు.

ఎలాంటి సంకోచం లేకుండా వెంటనే కిందకు వంగిన ప్రధాని మోదీ, ఆ త్రివర్ణ పతాక చిహ్నాన్ని చాలా జాగ్రత్తగా అపురూపంగా తీసుకున్నారు. జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 

ఇందుకు సంబంధించిన వీడియో  సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది. దేశంపై, జాతీయ జెండాపై ఒక దేశ ప్రధాని చూపించే గౌరవం ఏ స్థాయిలో ఉంటుందో ఈ సంఘటన నిరూపిస్తోందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరూ మోడీ చర్యను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు గుప్పిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  ప్రభుత్వాధినేతగా మోడీ పాతికేళ్ల ప్రస్థానం: అభివృద్ధి గణాంకాలు.. రాజకీయ వివాదాలు.!​

గతంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి  గుర్తు చేస్తున్నారు. సౌతాఫ్రికాలో జరిగిన బ్రిక్స్  సదస్సు సమయంలోనూ ప్రధాని మోదీ సరిగ్గా ఇలాగే వ్యవహరించారు. నేలపై పడి ఉన్న భారత జాతీయ జెండా గుర్తును కిందనుంచి తీసి భద్రపరచుకున్న సంగతిని ప్రస్తావిస్తున్నారు. 

దేశం పట్ల అంకితభావం కేవలం పెద్ద ప్రకటనలతోనే కాకుండా ఇలాంటి చిన్న చిన్న, బాధ్యతాయుతమైన పనుల ద్వారానే ప్రతిఫలిస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒక దేశ ప్రధాని తన జాతీయ పతాకంపై చూపిన ఈ అపారమైన గౌరవం అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మీకు నచ్చవచ్చు:  సీఎం చంద్రబాబుకు పీఎం మోడీ ఫోన్: తుపాన్ల నష్టంపై ఆరా.!​

ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ అరుదైన ఆహ్వానం.. స్మిత్ మచ్చర్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలనం.!

[NarendraModi, Nationalflag,  Quad Summit, NationalFlagRespect, TeluguOne]