నేనూ చీపురు పడతా.. సమంత
posted on Oct 9, 2014 12:01PM

భారత ప్రధాని నరేంద్రమోడీ చేపడుతున్న కార్యక్రమాలు తనకు ఎంతగానో నచ్చుతున్నాయని, ఆయన గాంధీ జయంతి నాడు ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని, తాను కూడా త్వరలో చీపురు పట్టి వీధులను శుభ్రం చేయనున్నానని కథానాయిక సమంత ప్రకటించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో హెపటైటిస్ బిపై జరిగిన అవగాహన శిబిరానికి హాజరైన సందర్భంగా సమంత ఇలా ప్రకటించారు. ‘‘స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నాకెవరూ సవాల్ విసరలేదు. అలా ఎవరైనా సవాల్ విసిరితే నేను కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటాను’’ అన్నారు. ఎవరో సవాల్ విసిరితే ఎందుకు.. అంత స్ఫూర్తి పొందితే తనంతట తానే స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనచ్చుగా!