కదిరిలో నారా లోకేష్ పర్యటన

 

 

nara lokesh tdp, chandrababu nara lokesh, nara lokesh naidu, chandrababu padayatra

 

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ నాయుడు కదిరిలో పర్యటించారు. ఆయన పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ నాయుడు పాల్గొన్నారు. లోకేష్ ఉత్సాహంగా పాల్గొనడంతో పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఈ బైక్ ర్యాలీలో లోకేష్‌తో పాటు పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పార్టీపై దృష్టి మరికొద్ది రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా లోకేష్ అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.


కదిరిలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అత్తార్‌చాంద్‌బాషా కొత్తగా నిర్మించిన అత్తార్ రెసిడెన్సీ భవనంలో జరిగే ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని అత్తార్ రెసిడెన్సీని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తెలుగునాడు విద్యార్ధి సమాఖ్య ఆద్వర్యంలో జరిగే కార్యక్రమం మేలుకొలుపులో పాల్లొంటారు. కదిరికి నారా లోకేష్ కదిరికి వస్తున్న సందర్భంగా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు లాల్‌జాన్‌బాషా, ఎమ్మెల్యేలు పరిటా ల సునీత , పయ్యావుల కేశవ్, బి.కె.పార్థసారథి, అబ్ధుల్‌ఘనీ, పల్లెరఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, ఇతర నాయకులు హనుమంతరాయ చౌదరి, మహాలక్ష్మీ శ్రీనివాస్, శమంతకమణి, హాజరు కానున్నట్లు మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అత్తార్‌చాంద్‌బాషా వివరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu