పవన్ పై నారా ప్రశంసలు.. అందుకేనా..!
posted on Sep 3, 2016 10:34AM

ప్రత్యేక హోదా విషయంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కొంతమంది విమర్శల బాణాలు వదులుతుంటే.. మరికొంత మంది మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. అందులో ఇప్పుడు టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కూడా చేరిపోయారు. నిన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ లోకేశ్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ అద్బుతమైన వ్యక్తని.. పవన్ ఒక వండర్‌ఫుల్ పర్సన్ అని, అరుదైన వ్యక్తిత్వం గల మనిషని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు లోకేశ్ చేసిన ట్వీట్ పై పలువురు పలు రకాలుగా అంటున్నారు. తమ పార్టీకి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ పనిచేయకుండా జాగ్రత్త పడడంలో భాగంగానే నారా లోకేష్ ఆ ప్రశంసలు చేసినట్లు అనుకుంటున్నారు. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అలాంటిదే కాబట్టి లోకేశ్ ఆ ఉద్దేశ్యంతోనే ప్రశంసించారా.. లేక అందరూ అనుకుంటున్నట్టు తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయకుడదనే ఉద్దేశ్యంతోనే ప్రశంసించారా.. తనకే తెలియాలి.