TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్పందిస్తారా, బర్నాల్ రాసుకుంటారా: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై వైసీపీకి లోకేష్ సవాల్.!

Published on: Mon Nov 23, 2026 11:08AM

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడుల వెల్లువపై వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతల విమర్శలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఘాటుగా బదులిచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.  రాష్ట్రంలోని   జిల్లాలోని పరిస్థితులు, వాతావరణం, వనరులు, అవకాశాల ప్రాతిపదికన పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని వివరించారు. 

 ఏయే జిల్లాలో ఏయే పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు నెలకొన్నాయనే వివరాలతో కూడిన రాష్ట్ర మ్యాప్‌ను నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదకగా షేర్ చేశారు.   కూటమి ప్రభుత్వ హయాంలో ఎక్కడెక్కడ ఏయే పరిశ్రమలు వచ్చాయి, ఎంత మందికి ఉద్యోగాలు లభించాయి. ఆ పరిశ్రమల ద్వారా  స్థానికంగా లభిస్తున్న ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై  సమగ్రంగా వివరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్న లోకేష్.. ఈ విషయంలో దాపరికం ఏమీ లేదన్నారు. ఈ విషయంపై  బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ చేశారు.   అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న పరిణామాలు, పరిశ్రమలను తరిమేసిన తీరుపైనా బహిరంగంగా చర్చించుకుందామని లోకేష్ అన్నారు. 

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుంటే, గతంలో ఆ పరిశ్రమలను వెళ్లగొట్టేందుకు వైసీపీ అరాచక శక్తులు శ్రమించాయంటూ విమర్శించారు. పరిశ్రమల విషయంలో రెండు ప్రభుత్వాల కాలంలో జరిగిన అంశాలను పక్కపక్కనే పెట్టి చర్చించాలని సవాల్ చేశారు.   ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టుకు  రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడుల వివరాలను తెలిపే మ్యాప్‌ను జత చేశారు. మరోవైపు వైసీపీ హయాంలో ఏం జరిగిందనే కోణంలో మరో మ్యాప్‌ను జత చేశారు. 

ఇక  అదే పోస్టుకు  బర్నాల్ ఆయింట్‌మెంట్ చిత్రాన్ని జోడించి.. ప్రస్తుత పెట్టుబడుల పురోగతిని చూసి తట్టుకోలేక కడుపు మంటతో రగిలిపోతున్న వారు బర్నాల్ రాసుకోవాలని ఎద్దేవా చేశారు.   ఇటీవల జరిగిన సీఐఐ సదస్సులో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తూ.. పది కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కోటి రూపాయల పెట్టుబడులు కూడా రాలేదంటూచేసిన వ్యాఖ్యలపై లోకేష్ ఈ మేరకు స్పందించారు. 

ఇది కూడా చదవండి:  ఏపీకి పెట్టుబడుల వెల్లువ: సీక్రెట్ ను బయటపెట్టిన లోకేష్.. రహస్య వ్యూహం అనుకరించమంటూ సెటైర్.!

 పెట్టుబడులు, పరిశ్రమలు, సీఐఐ ఒప్పందాల విషయంలో అధికార తెలుగుదేశం కూటమి, వైసీపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరుగా సాగుతున్న వేళ నారా లోకేష్ సెటైరికల్ రియాక్షన్ ప్రాధాన్యత సంతరించుకుంది.   రానున్న రోజుల్లో పెట్టుబడుల క్షేత్రస్థాయి పురోగతి, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

కాగా లోకేష్ సవాల్ కు వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందన్నన్నది చూడాల్సి ఉంది.  పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్న భావన పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమౌతున్న నేపథ్యంలో లోకేష్ సవాల్ కు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

మీకు నచ్చవచ్చు:  ఏపీకి కియా భారీ పెట్టుబడులు.. పెనుకొండలో మరో ప్లాంట్.!​

ఏపీలో కియా విస్తరణ: 14 వేల 167 కోట్ల పెట్టుబడి: విశాఖ ఇన్వెస్టర్ల సదస్సులో ఎంవోయూ.!

[Nara Lokesh, Challenge, YCP, Iindustries, Incestments,  CII summit, Employment opportunities, TeluguOne]