ఏపీకి పెట్టుబడుల వెల్లువ: సీక్రెట్ ను బయటపెట్టిన లోకేష్.. రహస్య వ్యూహం అనుకరించమంటూ సెటైర్.!
Published on: Sat Nov 21, 2026 11:15AM

గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారాలు, పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన విషయంలో విఫలం అంటూ, తమిళనాడు ప్రభుత్వం 15 మంది అధికారులను తొలగించినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ చర్చ మొదలైంది. తమిళనాడు ప్రభుత్వం తొలగించిన ఆ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యాపార సమాచారాన్ని లీక్ చేశారనీ, అందుకే విజయ్ సర్కార్ వారిని తొలగించిందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వం 15 మంది అధికారులను తొలగించడం, అందుకు వారు ఏపీకి లీకు వీరులుగా పని చేశారన్న చర్చ నడుమ లోకేష్ సెటైరికల్ గా చేసిన పోస్టుతో ఫుల్ స్టాప్ పెట్టారు.
పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ కు ఒక రహస్య వ్యూహం ఉందని పేర్కొన్న లోకేష్.. అదేంటో బయటపెట్టారు. ఆయన పోస్టు మేరకు ఆ రహస్య వ్యూహం ఏంటంటే.. పెట్టుబడిదారుల విజ్ఞప్తులకు అదే రోజున స్పందించడమే. ఈ విషయాన్ని పేర్కొన్న ఆయన ఈ వ్యూహాన్ని ఎవరైనా అనుకరించవచ్చు. అనుసరించవచ్చు అంటూ ఏపీకి తమిళనాడు అధికారుల నుంచి లీకులు అన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

వాస్తవానికి లోకేష్ వ్యంగ్యంగా చెప్పినప్పటికీ ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తడం వెనుక ఉన్న సీక్రెట్ అదే. లోకేష్ స్వయంగా పెట్టుబడిదారులకు, వ్యాపార సంస్థల అధిపతులకు తన మొబైల్ నంబర్‌ను ఇచ్చి.. వారితో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారు. పెట్టుబడి ప్రాజెక్టుల పురోగతిని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ, అనుమతులు సకాలంలో అందేలా, అదే సమయంలో ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూస్తున్నారు.
ఇది కూడా చదవండి: పారిశ్రామిక ఒప్పందాల అమలుపై ఆడిట్ రిపోర్ట్: పెట్టుబడులకు చట్టపరమైన రక్షణ.!
ఇందులో రహస్యం ఏమీ లేదు. రహస్య వ్యూహం అంతకంటే లేదు. పెట్టుబడుల ఆకర్షణ కోసం ఏపీ అవలంబిస్తున్న విధానాన్ని లోకేష్ పలు సందర్భాలలో బాహాటంగానే చెప్పారు. పెట్టుబడి దారుల్లో, పారిశ్రామిక వేత్తల్లో నమ్మకం, విశ్వాసం పాదుగొల్పగలగడం వల్లే ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వ్యాపార మంత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడుల ఆకర్షణలో ముందుంచడానికి దోహదపడుతోంది. దీనినే లోకేష్ తాజా ట్వీట్ ద్వారా పునరుద్ఘాటించారు. అయితే ఈ సారి ఆయన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి వచ్చే సందేహాలకు, విమర్శలకు తనదైన శైలిని ప్రత్యేక శైలిని జోడించారు అంతే.
మీకు నచ్చవచ్చు: ఏపీకి కియా భారీ పెట్టుబడులు.. పెనుకొండలో మరో ప్లాంట్.!
ఏపీలో కియా విస్తరణ: 14 వేల 167 కోట్ల పెట్టుబడి: విశాఖ ఇన్వెస్టర్ల సదస్సులో ఎంవోయూ.!
[APInvestments, SecretStrategy, Nara Lokesh, Follow, Imitate, TeluguOne]


