భరతం పడతాం.. ఖబర్దార్! జగన్ కు బాలయ్య వార్నింగ్
posted on Nov 20, 2021 11:35AM
తమ కుటుంబ సభ్యులపై నీచంగా మాట్లాడినా, ఇష్చమెచ్చినట్లుగా వీర్రవిగినా సహించలేదన్నారు బాలకృష్ణ. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే చాలా సంయమనం పాటించామని, ఇకపై ఎవరూ నోరు జారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బాలయ్య హెచ్చరించారు. అందరి భరతం పడతాం ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లో అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదన్నారు బాలయ్య.
చంద్రబాబుకు జరిగిన అవమానంపై నందమూరి ఫ్యామిలీ ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయాల్లో విమర్శలు సహజమన్నారు బాలకృష్ణ. అంశాల వారీగా ఎవరైనా విమర్శలు చేయవచ్చన్నారు. అయితే వైసీపీ నేతలు వాడుతున్న బాష దారుణంగా ఉందన్నారు. భువనేశ్వరిపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం అత్యంత నీచమన్నారు బాలకృష్ణ. రాష్ట్రాభివృద్దికి జరగకుండా కుట్రలు చేస్తున్నారని అన్నారు. అందరి ఇండ్లలో ఆడవాళ్లు ఉన్నారు.. హేళన చేయవద్దన్నారు.