తడకా చూపిస్తానంటున్నకుర్ర హీరో

 

అక్కినేని కుటుంబం నుండి వచ్చిన హీరోల్లో నాగార్జున తానూ గ్రీకు వీరుడినని చెప్పుకొంటుంటే, అతని కొడుకు నాగచైతన్య మాత్రం తన బెజవాడ, దడ సినిమాలు తిరగ్గొట్టిన ప్రజలందరికీ తన తడాకా చూపిస్తానని బెదిరిస్తున్నాడు. ఇటీవలే షూటింగు పూర్తి చేసుకొన్న అతని సినిమా పేరు ‘తడాకా.’ ఇది తమిళ్లో సూపర్ హిట్టయిన ‘వెట్టి’ అనే సినిమాకి తెలుగు రీమేక్. ఈ సినిమాలో చైతుతో పాటు కమెడియన్ సునీల్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆండ్రియా మరియు తమన్నాలు వీరికి జంటగా నటిస్తున్నారు. కొద్దిగా ప్యాచ్ వర్క్ తప్ప సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందని దర్శకుడు ‘డాలీ’ చెప్పారు. ఈ సినిమా వచ్చే నెలాకరులోగా లేదా జూన్ మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాను బెల్లం కొండ సురేష్ తన శ్రీ సై గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu