జవాన్ మురళీనాయక్‌ కుటుంబానికి పరిహారం అందజేత

 

ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు కూటమి సర్కార్ అండగా నిలిచింది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని మంత్రి సవిత, మురళీ నాయక్ తల్లిదండ్రులకు అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు వెళ్లిన మంత్రి.. వీర జవాన్ మురళీ నాయక్ సమాధి వద్ద  అంజలి ఘటించి నివాళులర్పించారు. 

అనంతరం రూ.50 లక్షలచెక్కు, 5 ఎకరాల భూమి, 6 సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను ఆయన  తల్లిదండ్రులకు అందజేశారు. గ్రామంలో రూ.14 లక్షలతో మురళీ నాయక్ సమాధి, అక్కడికి వెళ్లేందుకు రూ.16లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని వెల్లడించారు. మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి కల్పించారు.  కల్లితండా పేరు కుడా మార్చే ప్రతిపాదను రెవెన్యూ అధికారులు ఆలోచిస్తున్నారని ఆమె తెలిపారు. మురళీ నాయక్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.