చెత్తతో కరెంట్... ఆదర్శంగా నిలుస్తున్న అంబానీ ఫ్యామిలీ..

 

ప్రపంచంలోనే అత్యంత విలువైన ఇళ్లలో ఇండియాకు చెందిన ముకేశ్ అంబానీ ఇల్లు ఒకటి అని అందరికీ తెలిసిందే. ముంబైలోని అంటిలీయా అంటే ఎవరికైనా అర్ధమైపోతుంది. ముకేశ్ అంబానీ ఇల్లని. ఇక ముకేశ్ అంబానీ ఇంటి గురించి చెప్పాలంటే.. ఈ ఇంట్లో 27 అంత‌స్తులు ఉంటాయి. మొత్తం 600 మంది ఉద్యోగులు ప‌నిచేస్తారు. మూడు హెలీప్యాడ్లు, 168 కార్లు నిలిపే సామ‌ర్థ్యం గ‌ల పార్కింగ్, స్పా రూం, డ్యాన్సింగ్ స్టూడియో, థియేట‌ర్ రూం, టెర్రెస్ గార్డెన్స్‌, గుడి ఇంకా చాలా ఉన్నాయి. ఇక ఇంత పెద్ద ఇంట్లోనుండి ఎంత చెత్త వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఆ చెత్తనంతా ఏం చేస్తున్నారనుకుంటున్నారా..? ఏదో.. రోడ్ల మీదో, డంప్‌యార్డ్‌లోనో పడేయడం లేదు. వారికి ఓ చక్కని ఆలోచన వచ్చింది. ఆ చెత్త మొత్తాన్ని రీసైకిల్ చేసి గృహ‌ విద్యుత్ అవ‌స‌రాల‌కు వినియోగిస్తున్నారట. ఇంట్లో చెత్త‌ను త‌డి, పొడి చెత్త‌లుగా విభ‌జించి పొడి చెత్త‌తో విద్యుత్‌, త‌డి చెత్త‌తో గార్డెన్‌కు ఎరువుల‌ను త‌యారుచేస్తున్నారట. మరి అంబానీ లాంటి వాళ్లకు ఈ చెత్తను ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. కానీ... ముకేశ్ అంబానీ కుటుంబం మాత్రం.. చెత్తను ఇలా ఉపయోగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.