నీటి సమస్యలో టీమిండియా కెప్టెన్ ధోని...
posted on Apr 23, 2016 2:33PM

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ మధ్య తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవలే తన వాహనానికి ట్యాక్స్ కట్టని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అది అయిపోయిన వెంటనే మొన్నటిదాకా ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిన అతడు సోషల్ మీడియా కారణంగా ఆ పదవి నుంచి తప్పుకుని పెద్ద ఆదాయాన్నే కోల్పోయాడు. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కున్నారు. ధోని నివాసమైన రాంచిలో ఇప్పటికే నీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాంచీలోని తన ఇంటిలోని స్విమ్మింగ్ పూల్ కోసం ధోనీ రోజుకు 15 వేల లీటర్ల నీటిని వాడేస్తున్నాడట. ఈ మేరకు అతడి ఇరుగు పొరుగు నేటి ఉదయం తీవ్ర ఆరోపణలు చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
మొత్తానికి ఈనెల ధోనికి ఏమాత్రం కలిసిరానట్టే కనిపిస్తోంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో ఓటమి.. మళ్లీ రీసెంట్ గా ప్రారంభమైన ఐపీఎల్ లో అతని సారధ్యంలో పూణే జట్టు వరుస పరాజయాలను చూస్తోంది.