saveandhrapradesh2022@gmail.com ..వైసీపీ బెదిరింపుల‌పై ఎంపీ సుజ‌నా అభ‌య‌హ‌స్తం

నోరెత్తితే దాడి. విమ‌ర్శిస్తే దాడి. ఆరోపణ‌లు చేస్తే అటాక్‌. ఏపీలో ఇప్పుడంతా రౌడీ రాజ్యం.. ఫ్యాక్ష‌న్ రాజ్యం.. రాజారెడ్డి రాజ్యాంగం..అంటున్నారు. టీడీపీ నేత‌లే టార్గెట్‌గా రెండున్న‌రేళ్లుగా దాడులు జ‌రుగుతున్నాయి. అధికారం చేతిలో ఉంది క‌దానే బ‌లుపుతో.. ప్ర‌తిప‌క్షంతో పాటు ప్ర‌జ‌ల మీద కూడా దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. విశాఖ‌లో డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను ఎంత దారుణంగా టార్గెట్ చేసి.. ఆయ‌న చావుకు కార‌ణ‌మ‌య్యారో అంద‌రికీ తెలిసిందే. సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని సైతం వేధిస్తూ.. చుక్క‌లు చూపిస్తున్నారు. తాజాగా, మ‌రో అడుగు ముందుకేసి.. వైసీపీ నాయ‌కుల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడిన సొంత పార్టీ నేత‌ల‌పైనే దాడుల‌కు దిగారు. ఒంగోలులో సుబ్బారావు గుప్తాను కొట్టి.. మోకాళ్ల‌పై కూర్చోబెట్టిన ఘ‌ట‌న వైసీపీ లీడ‌ర్ల ఓవ‌రాక్ష‌న్‌కు నిద‌ర్శ‌నం. అటు, విశాఖ‌లో జ‌గ‌దీశ్వ‌రుడిపై దాడి ఘ‌ట‌న అధికార పార్టీ అరాచ‌కానికి ప‌రాకాష్ట అంటున్నారు. 

వైసీపీ ఆగ‌డాలు అడ్డుకోవాలంటే ఎవ‌రో ఒక‌రు ముందుకు రావాల్సిందే. అలాంటి బాధితుల‌కు నేనున్నానంటూ అభ‌య‌హ‌స్తం అందిస్తున్నారు బీజేపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి. ఏపీలో సీఎం, మంత్రుల పేర్లతో బెదిరింపులు పెరిగాయని సుజనా మండిప‌డ్డారు. ఎంపీల పేర్లతో కబ్జాలకు పాల్పడటం కామ‌న్‌గా మారిందని ఆరోపించారు. తక్షణమే సీఎం జగన్‌ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. 

వైసీపీ వేధింపులకు భయపడకుండా బాధితులు పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేయాలని ఎంపీ సుజ‌నా చౌద‌రి సూచించారు. ఆ ఫిర్యాదు కాపీలు తనకు పంపాలని.. బాధితులకు అండగా ఉంటానని సుజనా చౌదరి భరోసా ఇచ్చారు. ఆ కాపీలను saveandhrapradesh2022@gmail.comకు పంపించాలంటూ ట్వీట్‌ చేశారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu