శశిథరూర్‌ని పదవి నుంచి గెంటేశారు
posted on Oct 13, 2014 3:10PM

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశిథరూర్ మీద కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం బాగుందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీని పొగడ్డమే శశిథరూర్ చేసిన తప్పు. పొగిడింది చాల్లే ఆపమన్నా శశిథరూర్ ఎంతమాత్రం వినలేదు. దాంతో కేరళ కాంగ్రెస్ పార్టీ శశిథరూర్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సాగనంపాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే పార్టీలో సీనియర్ నాయకుడు అయిన దిగ్విజయ్ సింగ్ ఈ విషయాన్ని లైట్‌గా తీసుకున్నట్టు మాట్లాడ్డంతో శశి థరూర్ మీద చర్యలు వుండవన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. అయితే శశిథరూర్‌ని పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది.