జగన్ అక్రమాస్తుల కేసు: మోపిదేవి బెయిల్ ఫై విడుదల

 

 

 

జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి, చంచల్ గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ రావు కు సిబిఐ ప్రత్యెక న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. దీనితో ఆయన ఈ ఉదయం జైలు నుండి విడుదల అయ్యారు.

 

శబరిమల వెళ్లేందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలని మోపిదేవి కోర్టు ను అభ్యర్ధించిన విషయం తెలిసిందే. ఆయనకు జనవరి 2 వ తేదీ వరకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. విడుదల అయిన తర్వాత మోపిదేవి పంజగుట్ట లోని అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు చేశారు.

 

మోపిదేవి దాదాపు నెల రోజుల నుండి అయ్యప్ప దీక్షలో ఉన్నారు. దీనితో ఆయన శబరిమల యాత్ర కు వెళ్ళే అవకాశం లభించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu