మంకి పాక్స్ లక్షణాలు మెదడు పై ప్రభావం చూపిస్తుందా ?

మంకిపాక్స్ ఒక సాధారణ వైరస్ దీనిని ఒక ఇన్ఫెక్షన్ మాదిరిగానే పరిగణిస్తున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం తీవ్ర సమస్యలు వస్తాయని దీనివల్ల ఎన్సేఫ్లిటిస్ చదవడం,శక్తిని కోల్పోవడం వంటి ఇబ్బందులు మంకి పాక్స్ రోగులు ఎదుర్కుంటున్నారని నిపుణులు వెల్లడించారు. మంకి పాక్స్ ఎలాంటి వైరస్ అంటే ప్రపంచ వ్యాప్తంగా చుట్టేస్తోంది. కోరోనా వైరస్ తో పాటు మంకి పాక్స్ విస్తరిస్తూ ఉండడం తో ప్రజలలో తీవ్రమైన ఆందోళన వ్యక్త మౌతోంది.దీనితీవ్రతను నియంత్రించేందుకు తాత్కాలిక ఉపాయాలు ప్రారంభించారు. ప్రస్తుత సమయంలో మంకి పాక్స్ తీవ్రంగా విస్తరిస్తోంది.త్వరిత గతిన వ్యాప్తి చెందడం పై ప్రజలు తీవ్ర ఆందోళనకు గురిఅవుతున్నారని మంకి పాక్స్ కొన్ని కొత్తలక్షణాలు వ్యాధిగ్రస్తులను మరింత భయపెడుతోందని నిపుణులు అంటున్నారు.

మంకి పాక్స్ కొత్తలక్షణాలు...

చలిజ్వరం, లింఫ్ నోడ్స్ లో వాపులు, తలతిరగడం, తీవ్రమైన తలనొప్పి మంకి పాక్స్ లక్షణాలుగా గుర్తించారు. ఇవి మామూలు లక్షణాలే అయినా ఒక్కోసారి తీవ్రంగా పరిణమించవచ్చు అనింతున్నారు నిపుణులు. మంకి పాక్స్ వల్ల చేతులు,కాళ్ళ లో దద్దుర్లు,ముఖంతో పాటు, గొంతు జననేద్రియాలలో రెక్టల్ లో ను దద్దుర్లు రావచ్చు.దీనివల్ల శరీరం కొంత నొప్పిగా ఉండవచ్చు ప్రస్తుతం లభించిన కొన్నినమూనాల ఆధారంగా మంకి పాక్స్ ప్రాణాంతకంతకం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కొంతమంది రోగుల్లో ఎన్సేప్లిటిస్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వారిని వేదిస్తున్నాయి.

మంకి పాక్స్ కి సంబంధించి తీవ్రమైన కష్టాలు...

మంకి పాక్స్ సాధారణ లక్షణాలు దద్దుర్లు తోపాటు జ్వరంరావచ్చు. ఇలాంటి సమస్యలు చాలామందిలో తక్కువగానే చూడవచ్చని. మంకిపాక్స్ వల్ల న్యురోలాజికల్ సమస్యలు ఒకరకమైన కన్ఫ్యూజన్, తలతిరగడం, కొమావంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు.

మంకిపాక్స్ కు చికిత్చలు...

ప్రస్తుత పరిస్థితులలో సాధారణ వైద్య చికిత్చ 19 అధ్యయనాలు చేసారని ఇందులో 1512 ప్రజలు పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఎవరైతే మంకిపాక్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో మెదడులో వాపులు వచ్చినట్లు గుర్తించారు. భయానికి లోనుకావడం న్యూరో లాజికల్ సమస్యలు దీర్ఘ కాలం పాటు శక్తి కోల్పోవడం కారణాలుగా చెప్పవచ్చని నిపుణులు ఒక అధ్యయనం లో వెల్లడించారు.

మంకి పాక్స్ వల్ల మానసిక అనారోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది...

వైద్య నిపుణుల అంచనా ప్రకారం మంకిపాక్స్ రోగులు మానసిక అనారోగ్యం లక్షణాలు చూసినట్లు గమనించారు.ఇలా ఎందుకు జరుగుతోంది అన్న ప్రశ్నకు జవాబు లేదు.అంశం పై స్పష్టత రాలేదని నిపుణులు పేర్కొన్నారు. పశ్చిమ దేశాలలో నిర్వహించిన అధ్యయనం పరిశోదనలో మంకిపాక్స్ సోకిన తరువాత ప్రజల ఆలోచన మారిందని ఆందోళన పెరిగిందని దుర్లభమైన వైరస్ వల్ల న్యురోలాజికల్ సమస్యలు మానసిక రుగ్మతలు రోగాలు దీనివెంట వస్తున్నాయని పేదో ఫిజియాలజీ అర్ధం చేసుకోడానికి ఇతర అంతర్జాతీయ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని నిపుణులు పేర్కొన్నారు.