లొంగిపోయిన మావోయిస్టు కాకరాల సునీత ఎవరో తెలుసా?

కాకరాల సత్యనారాయణ.. ఈ పేరు ఎక్కడో బాగా విన్నట్లే అనిపిస్తుంది కదా! ఈయన  ఓ మంచి రచయిత. అంతే కాదు 300 పైగా సినిమాల్లో  నటించారు. విప్లవ రచయితగా పేరుగాంచిన కాకరాల సత్యనారాయణ కుమార్తె ఒక పెద్ద మావోయిస్టు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య సునీత.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి వైఎస్ ప్రభుత్వం మావోయిస్టులతో   జరిపిన శాంతి చర్చల్లో సుధాకర్ కీలకపాత్ర పోషించారు. సుధాకర్ ను సునీత ప్రేమించి పెళ్లి చేసుకుంది.  కాకరాల సునీత భర్త సుధాకర్ ఇటీవలే పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించారు.

ఇక కాకరాల సునీత అయితే నాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలోనే మమేకమై ఉన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆమె పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.  ఈ క్రమంలోనే సునీత రాచకొండ పోలీసులను బంధువుల ద్వారా కాంటాక్ట్ చేశారు. ఇప్పటివరకూ ఐదు భారీ ఎన్కౌంటర్లో పాలుపంచుకున్న సునీత పైన 20 లక్షల పైన రివార్డు ఉంది.  40 సంవత్సరాల్లో సునీత అంచలంచ లుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ వరకు వెళ్లారు. అంతే కాదు మావోయిస్టు సిద్ధాంతాలను కింది స్థాయి వరకు తీసుకెళ్లడంలో సునీత కీలకపాత్ర పోషించారు. మరోవైపు మావోయిస్టుల పత్రిక జంగ్, క్రాంతి లకు ఎడిటర్ గా పని చేశారు.. మావోయిస్టు భావజాలాన్ని యువతలోకి జోపించే ప్రయత్నం చేశారు.

మావోయిస్టు భావజాలానికి  యువత యువత ఆకర్షితులయ్యేలా సునీత కీలక పాత్ర పోషించారు. నల్లమల ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఛత్తీస్ గఢ్, తెలంగాణలలో సునీత పనిచేశారు.. ఇటీవల జరిగిన నేషనల్ పార్క్ ఎన్కౌంటర్ లో కూడా ఆమె పాల్గొన్నారు. మావోయిస్టుల ఎరివేతలో భాగంగా ఆపరేషన్ కగార్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అడవిలో అన్నలు ఉండే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సునీత జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయిం చుకుని, గురువారం (ఆగస్టు 21)  రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu