ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి హౌజ్ అరెస్ట్
posted on Sep 12, 2024 10:37AM
బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన నేతలకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడిగాంధీని మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి ఆరోపణలు చేయడం గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. బిఆర్ ఎస్ గుర్తుపై గెలిచిన అరికెపూడిగాంధీ వెంటనే రాజీనామా చేయాలని కౌషిక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.కౌషిక్ రెడ్డిపై కూడా అరికెపూడి కూడ ఇవ్వాళ అగ్రహం వ్యక్తం చేశారు. కౌషిక్ రెడ్డి నా ఇంటికి వస్తానని అన్నారు. నా ఇంటిపై గులాబీ జెండా ఎగరవేస్తానని అన్నారు. దమ్ముంటే ఉదయం పదకొండు గంటలకు రావాలని అరికెపూడి ఘాటుగా స్పందించారు. నువ్వో నేనే తేల్చుకుందామన్నారు. నా ఇంటికి కౌషిక్ రెడ్డి రాకుంటే నేనే నీ ఇంటికి వస్తానని అరికెపూడి అన్నారు. ఈ నేపథ్యంలో కౌషిక్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు. నా మాటలను అరికెపూడి వక్రీకరించాడని కౌశిక్ రెడ్డి అంటున్నారు. హౌజ్ అరెస్ట్ చేయడం వల్లే అరికెపూడి ఇంటికి వెళ్లలేకపోతును అని కౌషిక్ రెడ్డి అన్నారు. కెసీఆర్ తో నాకు మధ్య ఎలాంటి విభేధాలు లేవని మరో వైపు అరికెపూడి వివరణ ఇచ్చారు.