TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మిసిసిప్పి నదిలో టైటానిక్ తరహా ప్రమాదం: టూరిజం షిప్ ను ఢీకొన్న ట్యాంకర్ నౌక.!

Published on: Sat Nov 14, 2026 8:16AM

అమెరికాలోని   మిసిసిప్పి జరిగిన ఘోర ప్రమాదం టైటానిక్ సినిమాలో ఓడ ప్రమాదాన్ని తలపించింది. అదృవశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. కానీ ప్రమాదం జరిగిన తీరు మాత్రం భయాందోళనలు కలిగించేలా ఉంది. ఇంతకీ అసలేం జరిగిందంటే.. నదీ తీరంలో  నిలిపి ఉంచిన ఒక పర్యాటక క్రూయిజ్ షిప్‌ను,  ఒక భారీ ట్యాంకర్ నౌక బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో   క్రూయిజ్ తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా,   చూస్తుండగానే, నదిలో పూర్తిగా మునిగిపోయింది.   ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ దృశ్యాలను చూస్తున్న అందరికీ   చరిత్రాత్మక టైటానిక్ నౌక ప్రమాదం కళ్లముందు కదలాడింది. 

ప్రమాదం జరిగిన సమయంలో క్రూయిజ్ షిప్‌లో పలువురు పర్యాటకులు ఉన్నారు.   ట్యాంకర్ ఢీకొట్టిన తీవ్రతకు నౌక ఒక్కసారిగా ఒక వైపుకు ఒరిగిపోవడంతో లోపల ఉన్న వారంతా  భయాందోళనలకు గురయ్యారు. నౌక పూర్తిగా మునిగిపోతోందని గ్రహించిన ప్రయాణికులు..  వెంటనే తమ వద్ద ఉన్న లైఫ్ జాకెట్లను ధరించి నదిలోకి దూకేశారు.

నదీ ప్రవాహంలో ఈదుకుంటూ అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకున్నారు.  తొలుత ఈ ప్రమాద తీవ్రతకు  కొందరు పర్యాటకులు  నౌక నుంచి బయటపడే అవకాశం లేక, నౌకతో పాటు మునిగిపోయి జలసమాధి అయ్యారన్న ఆందోళన వ్యక్తమైనా, తరువాత అందరూ సురక్షితంగా బయటపడ్డారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  

ఈ   ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. భారీ నౌక నీటిలో నెమ్మదిగా మునిగిపోతున్న తీరు, ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేస్తూ నీళ్లలోకి దూకుతున్న దృశ్యాలు  హృదయాలను కదిలించేదిగా ఉంది.  నెటిజనులు ఈ ప్రమాదాన్ని   హాలీవుడ్ చిత్రం  టైటానిక్ లోని ఓడ ప్రమాదంతో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  హర్మూజ్ లో కొత్త రూట్.. ఇరాన్, ఒమన్ మధ్యఒప్పందం.!

 రద్దీగా ఉండే  మిసిసిప్పి జలమార్గంలో ట్యాంకర్ నౌక నియంత్రణ కోల్పోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ట్యాంకర్ కెప్టెన్ నిర్లక్ష్యమా,  సాంకేతిక లోపమా  అన్న కోణంలో  అమెరికా కోస్ట్ గార్డ్, రవాణా శాఖ అధికారులు  విచారణ ప్రారంభించారు.

ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. మునిగిపోయిన క్రూయిజ్ షిప్ శిథిలాలను తొలగించడంపై యంత్రాంగం   దృష్టి సారించింది.    భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా మిసిసిప్పి నదిలో నౌకల రాకపోకలపై   భద్రతా నిబంధనలను అమలు చేయాలని పర్యాటకులు, నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని ఒక వేళ మానవ తప్పిదం ఉంటే అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

మీకు నచ్చవచ్చు:  హర్మూజ్ లో నౌకపై దాడి: అందులో భారత సిబ్బంది..అందరూ క్షేమం.!

మూసీ ప్రాజెక్టు తొలి దశ పనులు ప్రారంభానికి ముహూర్తం ఖరారు.!

 

[MississippiRiver,  CruiseShipAccident, Titanic Like Incident, Ship Sink,  Telugu One]