TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మూసీ ప్రాజెక్టు తొలి దశ పనులు ప్రారంభానికి ముహూర్తం ఖరారు.!

Published on: Thu Sep 10, 2026 8:24AM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది.  ఈ ప్రాజెక్టు తొలి దశ పనులను దసరా పండుగ రోజున అధికారికంగా  ప్రారంభం కానున్నాయి.  ఈ ప్రాజెక్టు తొలి దశ పనుల కోసం  ప్రభుత్వం రూ. 7,345.12 కోట్లు కేటాయించింది. ఇందుకు సంబంధించిన పరిపాలన అనుమతులను మంజూరు చేసింది.  

 ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్  ద్వారా  4 వేల 500 కోట్లు రుణం సమీకరించనుంది.  ఒక మిగిలిన  రూ.2,845.12 కోట్లు హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ వంటి స్థానిక సంస్థల ద్వారా సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కాగా మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించిన ఏడీబీ  రుణం మంజూరుకు అంగీకరించింది. దీంతో  దసరా నుంచే తొలి దశ పనులను ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ ముహూర్తం ఖరారు చేసింది.  

మొదటి దశ పనుల్లో భాగంగా నదిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన వ్యర్థాలు, పూడికను  తొలగించనున్నారు. అలాగే నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి బోటింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. నదికి ఇరువైపులా  రోడ్లు,  ల్యాండ్‌స్కేపింగ్, సైకిల్ ట్రాక్‌లు, పాదచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నారు. నగరంలోని మురుగు నీరు నేరుగా నదిలో కలవకుండా ఇరువైపులా   ట్రంక్ లైన్లు, వర్షపు నీటిని మళ్లించే ప్రత్యేక డ్రెయిన్లను ఏర్పాటు చేయనున్నారు. 


[Musi River Rejuvenation Phase1 Works, Dusara, Hyderabad Musi Project, Asian Development Bank, development works]