అంతా మంచోళ్లే.. మరి పాలకుండలోకి నీళ్లెలా వచ్చాయ్?

రాష్ట్రంలోని కార్పొరేట్‌  విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నాయని  ఉపముఖ్యమంత్రిగారన్నారు. అంతేకాదు కార్పొరేట్‌ విద్యాసంస్థలు  నాణ్యమైన విద్యను బోధించడం లేదని, విద్యను వ్యాపారంగా మార్చేశాయని తల్లిదండ్రుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నాయని  ఆవేదన చెందారు.  ఉపాధ్యాయ వృత్తికి క్రమంగా విలువ తగ్గిపోతున్నదని, బాలలకు విలువలతో కూడిన విద్యను అందించాలని, అప్పుడే సమాజంలో కుల, మత, ప్రాంత తారతమ్యాలను దూరంచేయవచ్చునని అన్నారు.  ఇలా  రవీంద్రభారతిలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలువురు వ్యక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Ministers, ap ministers, damodar raj narsimha, cm, kiran kumar reddy, politics, politicians, Work for public

వాళ్ళు చెప్పిన దాంట్లో  ఎంతో వాస్తవముంది. కార్పొరేట్‌ విద్యాసంస్థలు  నాణ్యమైన విద్యను బోధించడం లేదని,   విద్యను వ్యాపారంగా మార్చేశాయని చెబుతున్నారు.. సరే కానీ.. అలా జరగకుండా చూసేందుకు ఎవరైనా నిజాయితీగా పనిచేశారా? అంటే మాత్రం నిశ్శబ్దమే సమాధానమౌతుంది.   భావితరం బాగుండాలంటే  నిజాయితీగల నేతలు ముందుకురావాలి! నిజాయితీ అంటే ఏంటి? “ అని మన ప్రియతమ నేతలు మరో ప్రశ్నని సంధిస్తే మాత్రం మనం నోరెళ్లబెట్టకతప్పదుమరి.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu