మహానాడు సక్సెస్‌‌ను వైసీపీ జీర్ణించుకోలేకపోతుంది : సోమిరెడ్డి

 

మంత్రి  లోకేష్ ఆరు సూత్రాలంటే..వైసీసీ క్రిమినల్ ఐడియాలజీని ఆవిష్కరిస్తోందని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రజలు సైకిల్‌తో కొట్టినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని ఆయన అన్నారు. కడప వేదికగా జరిగిన మహానాడు సూపర్ సక్సెస్‌ను వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో రాజీలేని పోరాటం, అధికారం చేపట్టాక రాష్ట్ర అభివృద్ధి కోసం మా యువ నాయకుడు పడుతున్న తపన చూసి జగన్ రెడ్డి ఆయన మాజీ మంత్రులు కడుపుమంటతో రగలిపోతున్నారు. 

మహానాడులో రాష్ట్ర భవిష్యత్ కోసం లోకేశ్ బాబు ఆరు సూత్రాలను ప్రతిపాదిస్తే.. వైసీపీ మాత్రం తమ డీఎన్ఏలోని క్రిమినల్ ఐడియాలజీని ఆవిష్కరించిందన్నారు. వైసీపీ ఆవిష్కరించిన ఆ నాలుగు అంశాలేంటో ఏపీ ప్రజలను తెలియాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ వ్యవస్థా బాగుండకూడదని జగన్ ఆశపడుతున్నారు. ప్రజలు అన్యాయానికి గురైపోవాలని, ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవ్వాలని, వైసీపీ అధికారంలోకి రావాలనే లక్ష్యాలతో బ్లూ మీడియా పత్రికలో వార్తలుంటున్నాయి. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఒక రాజకీయ పార్టీకి, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి వస్తుండటం చాలా దురదృష్టకరమని సోమరెడ్డి అన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu