ఏపీ మంత్రి అవంతికి కరోనా పాజిటివ్
posted on Sep 15, 2020 10:07AM

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ఇటు సామాన్య ప్రజలనే కాక అటు ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా చుట్టబెడుతున్న సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లో మరో మంత్రి వచ్చి చేశారు. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. అయన తో పాటు ఆయన కుమారుడికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం ఇద్దరూ హోంఐసోలేషన్‌లోకి వెళ్లారు.
తానూ తన కుమారుడు కరోనాకు చికిత్స తీసుకుంటున్నందువల్ల తనను నేరుగా కలవడానికి ఎవరూ ఇంటికి రావొద్దని అయన కోరారు. అలాగే తన ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని మంత్రి తన అనుచరులకు తెలిపారు. ఏవైనా అత్యవసరమైన పనులకు తన కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఇంకా ఏదైనా సమస్య ఉన్నవారు సిబ్బందిని ఫోన్ లో సంప్రదించవచ్చని మంత్రి తెలిపారు.