మెగా స్టార్ చిరు ఖాతాలో మరో ప్రపంచ రికార్డ్

మెగాస్టార్ చిరంజీ మరో ప్రపంచ రికార్డ్ సాధించారు. ఆయనక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది.  156 చిత్రాలలో నటించిన చిరంజీవి 537 పాటలకు 24,000 డ్యాన్స్ మూవ్ మెంట్స్ చేశారు. మరే నటుడు ఇన్ని పాటలకు స్టెప్పులేసి దాఖలాలు లేవు. అందుకే చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. ఈ అవార్డును అందించడం కోసం గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యేకంగా హైదరాబాద్ కి వచ్చారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా అవార్డును చిరంజీవికి అందించారు.
చిరంజీవి ఈ ఏడాది ఇప్పటికే ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పొందారు. ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి మరో ఘనత సాధించారు. దీంతో మెగా అభిమానులతో పాటు, తెలుగు సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకొని, మెగాస్టార్ చిరంజీవి అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి  ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందుకునే వేదికపై ఓ వక్త వెల్లడించారు.  చిరంజీవి 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారని, అయినప్పటికీ ఈ వేడుకకు హాజరయ్యారని, అది ఆయనకున్న డెడికేషన్ అని ఆయన పేర్కొన్నారు.చిరంజీవి అయితే చికెన్ గున్యా నుంచి  పూర్తిగా కోలుకుంటున్నారని, అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu