ఆడవాళ్లు జీన్స్ వేసుకోవడం వల్ల భూకంపాలు వస్తున్నాయి

భూకంపాలు ఎలా వస్తున్నాయో తెలుసా? మహిళలు జీన్స్ ప్యాంట్ లు వేసుకోవడం వల్ల భూకంపాలు వస్తున్నాయంటా. ఇది శాస్త్రవేత్తలు చెపుతున్న మాటలు కాదు ఒక ఉగ్రవాది పైత్యపు మాటలు. పాకిస్థాన్ లోని జమైత్ ఉలేమా ఎ ఇస్లామీ ఫజల్ అధినేత (ఉగ్రవాద నేత) మౌలానా పజ్లుర్ రెహమాన్ ఇటీవల ఇస్లామాబాద్ లోని ఒక హోటల్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మహిళలు జీన్స్ ప్యాంట్ లు వేసుకోవడం వలనే భూకంపాలు వస్తాయని, వెంటనే పాకిస్థాన్ లో జీన్స్ ప్యాంట్ వేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు.