మావోయిస్టుపార్టీ వారోత్సవాలు.. ఏజెన్సీ ప్రాంతాలలో పోలీసుల ముమ్మర తనిఖీలు

తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ వారోత్సవాలు ఏటా జులై 28 నుంచి ఆగస్టు 3 వరకూ జరుగుతాయి. అందులో భాగంగానే సోమవారం (జులై 28) నుంచి ఆగస్టు మూడు వరకూ మావోయిస్టు పార్టీ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ వారోత్సవాలలో భాగంగా నక్సలైట్లు ఎన్ కౌంటర్లలో మరణించిన అమరులను స్మరించుకుంటూ జోహార్లు తెలుపుతారు. అలాగే తమకు పట్టు ఉన్న ప్రాంతాలలో  సభలూ, సమావఏశాలు నిర్వహిస్తారు. ఇలా ఉండగా  మావోయిస్టు పార్టీ వారోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అందులో భాగంగానే ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జాతీయ రహదారి పై వాహన తనిఖీలు చేపట్టిట్టారు.  సాధారణంగా మావోయిస్టు పార్టీ వారోత్సవాల సందర్భహంగా నక్సలైట్లు ఉనికి చాటుకునేందుకు విధ్వంసాలకు పాల్పడుతుంటారు. అటువంటి సంఘటనలను నివారిం చడానికి పోలీసులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పెద్ద ఎత్తున మోహరించి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.  తెలంగాణ, చత్తీస్ఘాడ్ సరిహద్దు ప్రాంతాలలోని జాతీయ రహదారుల గుండా వెళ్ళే ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసి బస్సులలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
అంతే కాకుండా దండకారణ్యంలో కూంబింగ్ చేస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu