నటి మనోరమ కన్నుమూత

 

ప్రముఖ దక్షిణాది సినీ నటి మనోరమ (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె శనివారం అర్ధరాత్రి చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. దక్షిణాది భాషలన్నిటిలో నటించిన ఆమె ముఖ్యంగా తమిళ భాషలో ఎక్కువ సినిమాలలో నటించారు. ఆమె మొత్తం వెయ్యికి పైగా సినిమాలలో నటించారు. మనోరమ అసలు పేరు గోపీశాంత. 1937వ సంవత్సరంలో తమిళనాడులోని మన్నార్‌గుడిలో ఆమె జన్మించారు. నటిగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు.