సంగారెడ్డి జైల్లో మ‌లేషియా టూరిస్టులు!  

బ‌డి సెల‌వ‌లివ్వ‌గానే అమ్మ‌మ్మ ద‌గ్గ‌రికి వెళ్ల‌డం పిల్ల‌లంద‌రికీ స‌ర‌దా. గ్రామంలో సెల‌వ‌లు స్వేచ్ఛ‌గా గ‌డిపేయ‌చ్చ‌ని, కుర్రాళ్ల‌కి కులూ మ‌నాలీ పిచ్చీ ఉండ‌వ‌చ్చు. అస‌లా మాట‌కి వ‌స్తే వేరే ప్రాంతాలు సంద ర్శించాల‌నుకునేవారికి దేశంలో ఎక్క‌డికైనా వెళుతూంటారు. కానీ చిత్రంగా ఈ విదేశీయులు ఇద్ద‌రూ ఏకం గా తెలంగాణా వ‌చ్చి ప‌నిగ‌ట్టుకుని  జైల్లో రెండు రోజులు గ‌డిపారు. ఇదేమి ఆనందం. ఆనంద‌మే అదో చిత్రమైన అనుభూతి! ఇద్ద‌రూ టూరిస్టులే.. దొంగ‌లు కారు.
 
ప్ర‌తీ దేశం, ప్ర‌తీ ప్రాంతం టూరిస్టుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో దూకుడుగానే ఉంటాయి. అనేక ప్రాంతాల‌ను అంద‌రికీ ఆక‌ట్టుకునే విధంగా మారుస్తుంటారు. పాత‌కాలం క‌ట్ట‌డాలు, భ‌వంతులు, హోట‌ళ్ల‌తో స‌హా అన్నీ టూరిజం శాఖ బ్ర‌హ్మాండంగా త‌యారుచేసి దేశ‌, విదేశీ టూరిస్టుల నుంచి మెప్పు పొంద‌డానికి పెద్ద దండ‌ల‌తోనే గ‌మ్మంలో ఎదురుచూస్తుంటారు.  

కానీ ఇటీవ‌ల తెలంగాణాకు ఇద్దరు టూరిస్టులు కౌలాలం పూర్ నుంచి వ‌చ్చారు. నిగ్ ఇన్ ఊ, అత‌ని స్నేహితురాలు ఒంగ్ బూన్ టెక్‌. వీళ్లిద్ద‌రూ భార‌త్‌లో పురాత‌న క‌ట్ట‌డాలు ప్ర‌దేశాలు సంద‌ర్శించాల‌ను కుని ఎంతో ప్లాన్ చేసుకుని మ‌రీ వ‌చ్చారు. కానీ వారిని సంగారెడ్డి జైలే ఎక్కువ ఆక‌ట్టుకుంది! కానీ ఇదేమీ పిచ్చి వెర్రీ కాదు కావాల‌నే జైలుకి వెళ్లారు. తెలంగాణా ప‌ర్యావ‌ర‌ణ శాఖ  ఒక చిత్ర‌మైన  కార్య‌క్ర‌మం చేప ట్టింది. దాని పేరు.. ఫీల్ ద జైల్‌!  ఇందులో భాగంగా ఎవ‌ర‌యినా స‌రే 24 గంట‌ల‌పాటు సంగారెడ్డి జైల్లో గ‌డ‌ప‌వ‌చ్చు. అంటే అస‌లు జైల్లో వాతావ‌ర‌ణం ఎలా ఉంటుంది, జైల్లో ఉన్న‌వారిని ఎలా చూస్తారు, అక్క‌డ  దోషుల‌కు ఎలాంటి వ‌స‌తులు క‌ల్పిస్తారు ఇలాటివ‌న్నీ తెలుసుకోను వీలుంటుంది. పైగా అతి పురాత‌న మైన క‌ట్ట‌డం క‌నుక స‌హ‌జంగానే ప‌ర్యాట‌కులు ఆస‌క్తి చూపుతున్నారు. 

మ‌లేషియా నుంచి వ‌చ్చిన ఈ ఇద్ద‌రు టూరిస్టుల‌కు అదే ఆస‌క్తిక‌రంగా అనిపించింది. సంగారెడ్డి జైలు 1796 ఎ.డి లో ప్ర‌ధాని మొద‌టి సాలార్‌జంగ్ స‌మ‌యంలో నిర్మించారు. అంటే 220 సంవ‌త్స‌రాల క్రితంది. కేవ‌లం గోల్కొండ‌, చార్మినార్ లే కాకుండా ఇలాంటి పురాత‌న క‌ట్ట‌డాలు కూడా ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. సాధార‌ణంగా జైలు అన‌గానే భ‌యప‌డ‌తాం. కానీ దీన్ని జైలులా కాకుండా ప‌ర్యాట‌క ప్ర‌దేశం, క‌ట్ట‌డంలా భావిస్తే స‌రి. మ‌లేషియా జంట రూ.500 చెల్లించి రెండు రోజులు  సంగారెడ్డి జైల్లో గ‌డిపారు. అక్క‌డి భోజ‌నం, వ‌స‌తి వారికి ఎంతో న‌చ్చింది.