చక్కనయ్య చిక్కిపోయాడు!

 

 

 

చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. అయితే ఈ సామెత మాత్రం చక్కనయ్యలకి వర్తించదని ఇప్పుడు రాష్ట్రంలో తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ అర్థమవుతోంది. చక్కనయ్య చిక్కితే ఉన్న అందం కూడా పోగొట్టుకుంటాడని నిరూపణ అయింది. ఇంతకీ ఆ చిక్కిన చక్కనయ్య ఎవరయ్యా అంటే, ఇంకెవరయ్యా.. సూపర్‌స్టార్ మహేష్‌బాబు! ఈమధ్యకాలంలో టాలీవుడ్‌ కుర్ర హీరోలకి సిక్స్ ప్యాక్ పిచ్చి బాగా పట్టుకుంది. ఎవరుబడితే వాళ్ళు సిక్స్ ప్యాక్ చేసిపారేస్తున్నారు. చివరికి హీరోగా మారిన కమెడియన్ సునీల్ కూడా సిక్స్ ప్యాక్ చేసేశాడు. మహేష్‌బాబు బావ, చిన్నసైజు హీరో అయిన ..... కూడా ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాడు. అయితే అది సిక్స్ ప్యాక్‌లా కాకుండా ముక్కలు చెక్కలుగా ‘టెన్ ప్యాక్’లా కనిపించింది.. అది వేరే సంగతి!

 

ఇలా ఎవడు పడితే వాడు సిక్స్ ప్యాక్ చేసేస్తున్నాడు.. మా హీరో మాత్రం సిక్స్ ప్యాక్ చేయడం లేదన్న బాధ మహేష్ బాబు అభిమానుల్లో వుండేది. మహేష్‌కి కూడా ఆ ఫీలింగే కలిగినట్టుంది. ‘1’ (నేనొక్కడినే) సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాడు. ఏం సిక్స్ ప్యాకో ఏంటో గానీ, ఆ ఎక్సర్‌సైజులూ వాటి వల్లనేమోగానీ, మహేష్ బాబు ముఖం టూమచ్‌గా చిక్కిపోయింది. ‘1‘ సినిమాలో మహేష్‌ సిక్స్ ప్యాక్‌ని చూపించీ చూపించకుండా చూపించి వదిలేశారు. అయితే పీక్కుపోయిన మహేష్ ముఖాన్ని చూడలేక ప్రేక్షకులు విలవిలలాడిపోయారు.



ముఖ్యంగా మహేష్‌ని ఆరాధించే ఆడపిల్లలయితే మనసు కష్టపెట్టుకున్నారు. ఈ ఆవేదనని అర్థం చేసుకున్నట్టున్నాడు అందుకే మహేష్‌బాబు ఈ పాయంట్ మీద తన వివరణ ఇచ్చాడు. సిక్స్ ప్యాక్ చేయడం వల్ల ఈ సినిమాలో తన ముఖం బాగా పీక్కుపోయినట్టు కనిపిస్తోందని తానే చెప్పాడు. అంటే సినిమాకి వెళ్ళబోయేవాళ్ళు తన ఫేస్‌ని చూసి ఫీలవకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇలా చెప్పాడన్నమాట. ఈ ముందు జాగ్రత్త ఏదో సిక్స్ ప్యాక్ చేయకముందు వున్నట్టయితే చిక్కిపోయిన చక్కనయ్యని చూడాల్సిన పరిస్థితి తెలుగు ప్రేక్షకులకు వచ్చేది కాదు కదా?!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu