శివసేన ‘మహా’ గజిబిజి

 

మహారాష్ట్రలో తాను అధికారం చేపడతానని భావించిన శివసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తన మద్దతు కూడా అడగకపోవడంతో అయోమయ పరిస్థితిలో పడిపోయింది. అందుకే గజిబిజిగా వ్యవహరిస్తోంది. బుధవారం నాడు మహారాష్ట్రలో ఫడ్నవిస్ నాయకత్వంలోని ప్రభుత్వానికి బలపరీక్ష జరగనుంది. తన మద్దతు విషయంలో బీజేపీ ఎంతకీ స్పందించకపోవడంతో శివసేన తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని ప్రకటించింది. ఈలోగా స్పీకర్ ఎన్నిక విషయంలో కూడా మొండిపట్టుతో వ్యవహరించింది. తమకు స్పీకర్ పదవి ఇవ్వాలని బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ బీజేపీ లొంగకపోవడంతో శివసేన పార్టీ స్పీకర్ పదవి కోసం తమ అభ్యర్థిని నిలబెట్టనున్నట్టు ప్రకటించింది. అయినప్పటికీ బీజేపీ దారికి రాకపోవడంతో తమ అభ్యర్థిని పోటీకి నిలిపి భంగపడటం ఎందుకులే అనుకుందో ఏమోగానీ, తమ అభ్యర్థిని నిలిపే ప్రతిపాదనను విరమించుకుని, బీజేపీ అభ్యర్థి బాగ్డేకి మద్దతు ఇస్తానని ప్రకటించింది. మరోవైపు తాను కూడా స్పీకర్ పదవికి పోటీలో వుండాలని ఉవ్విళ్ళూరిన కాంగ్రెస్ పార్టీ కూడా మెల్లగా చల్లబడి పోటీ నుంచి తప్పుకుంది. బీజేపీ మాత్రం ఎవరు ఎన్ని కుప్పిగంతులు వేసినా గుంభనంగా వుంది. ఎవరినీ మద్దతు అగడకుండా, కాంగ్రెస్ తప్ప ఎవరి మద్దతు అయినా తీసుకుంటామని ప్రకటించింది. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu