వేదికపై అంజన్ అసంతృప్తి

 

 M. Anjan Kumar Yadav, Anjan Kumar Yadav congress, Anjan Kumar Yadav congress pcc meeting

 

కేంద్ర మంత్రిగా నేను అర్హుణ్ని కాదా అని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్ సమావేశంలో ఎంపీ అంజన్‌కుమార్ ప్రశ్నించారు. దేశంలో 22 కోట్ల మంది యాదవులు ఉన్నారని.. దక్షిణాది నుంచి గెలిచిన ఏకైక యాదవ ఎంపీని తానేనని అంజన్‌కుమార్ మండిపడ్డారు. యూపీఏ వచ్చిన నాటినుంచి బీసీలకు మంత్రి పదవి దక్కలేదని, కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఎంపీ అంజన్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఇతరపార్టీలోకి బీసీల వలసలు పెరుగుతున్నాయని అంజన్‌కుమార్ అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ అంజన్‌కుమార్ ఫైర్‌ అవ్వడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu