లాస్ ఎంజెల్స్ మేయర్: భారత సంతతి నేత నిత్యారామన్.!
Published on: Fri Nov 6, 2026 9:12AM

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ మేయర్ ఎన్నికలలో భారత సంతతికి చెందిన నగర కౌన్సిల్ సభ్యురాలు నిత్యా రామన్ విజయం ఖరారైంది. కౌంటింగ్ లో ఆమె తన సమీప ప్రత్యర్థి, ప్రస్తుత మేయర్ కేరెన్ బ్రెస్పై భారీ ఆధిక్యంలో ఉన్నారు.
తాజా సమాచారం మేరకు నిత్యా రామన్ మెజారిటీని తగ్గుతుందేమో కానీ విజయం మాత్రం ఖాయం అంటున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ఓట్ల సరళి ఆమెకు అనుకూలంగా ఉంది.
ఈ ఎన్నికల పోరులో నిత్యా రామన్ అనుసరించిన వ్యూహాలు లాస్ ఏంజెల్స్ వాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నగరంలో నెలకొన్న గృహ నిర్మాణ సమస్యలు, నిరాశ్రయుల సంక్షేమం, ప్రజా సేవలు, భద్రతా అంశాలపై ఆమె స్పష్టమైన ప్రణాళికలను ప్రజల ముందుంచారు. యువత, మధ్యతరగతి ప్రజల నుంచి ఆమెకు అనూహ్య స్పందన లభించింది.

ప్రస్తుత మేయర్ కేరెన్ బ్రెస్ పాలనా వైఫల్యాలు, ముఖ్యంగా ఇటీవల నగరంలో తలెత్తిన కొన్ని విపత్కర పరిస్థితులను సరిగ్గా ఎదుర్కోవడంలో జరిగిన జాప్యం వంటి అంశాలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిటీ కౌన్సిల్లో సభ్యురాలిగా నిత్యా రామన్ చేసిన సేవలను ప్రజలు గుర్తుచేసుకుంటూ, నగరానికి నూతన నాయకత్వం అవసరమని జనం భావించారని ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది.
ఇది కూడా చదవండి: మేరీ ల్యాండ్ గవర్నర్ గా రెండో సారి: తెలుగు సంతతి యువతి అరుణా మిల్లర్.!
గతంలో లాస్ ఏంజిల్స్ స్థానిక రాజకీయాల్లోకి సామాజిక కార్యకర్తగా ప్రవేశించిన నిత్యా రామన్, అనతికాలంలోనే ప్రజల మన్ననలను పొందారు. గత నగర కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించి సంచలనం సృష్టించిన ఆమె, ఇప్పుడు ఏకంగా మేయర్ పదవిని కైవసం చేసుకోనున్నారు. అమెరికాలో ఒక ప్రధాన నగర మేయర్ స్థానానికి పోటీ పడుతున్న భారత సంతతి మహిళగా ఆమె ఇప్పటికే చరిత్ర సృష్టించారు. ఇప్పుడు గెలిస్తే మేయర్ గా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా రికార్డు సృష్టిస్తారు.

ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంటున్న తరుణంలో, నిత్యా రామన్ విజయం సాధించడం లాంఛనమే అంటున్నారు పరిశీలకులు. లాస్ ఎంజెల్స్ నగర చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెరతీసేలా ఆమె విజయం సాధిస్తారని మద్దతుదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఆమె లాస్ ఏంజిల్స్ తదుపరి మేయర్గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మీకు నచ్చవచ్చు: అమెరికా మధ్యంతర ఎన్నికలు: డెమొక్రట్ల హవా.. ట్రంప్ పాలనపై ప్రజాగ్రహం.!
అమెరికా మధ్యంతర ఎన్నికలు: డెమొక్రట్ల ఆధిక్యత: ట్రంప్ శిబిరంలో ఆందోళన.!
[Los Angeles Mayor Nithya Raman, Defeat Karen Bass, LA Mayoral Election, Indian-American Mayor, Telugu One]


