TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మేరీ ల్యాండ్ గవర్నర్ గా రెండో సారి: తెలుగు సంతతి యువతి అరుణా మిల్లర్.!

Published on: Thu Nov 5, 2026 9:21AM

అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన   హైదరాబాద్‌లో జన్మించిన అరుణా మిల్లర్‌ అ మేరీల్యాండ్‌ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా  రెండోసారి భారీ విజయం సాధించారు. డెమొక్రటిక్‌ పార్టీ తరఫున గవర్నర్‌ అభ్యర్థి వెస్‌ మూర్ తో కలిసి బరిలోకి దిగిన అరుణా మిల్లర్‌, మరోమారు ఎన్నికై తన సత్తా చాటుకున్నారు. ఈ విజయంతో తెలుగు జాతికి, భారతీయులకు అమెరికా గడ్డపై మరోసారి ప్రత్యేక గుర్తింపు లభించినట్లయింది.

హైదరాబాద్‌లో జన్మించిన అరుణా మిల్లర్‌ చిన్నతనంలోనే   కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. అమెరికాలో సివిల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీర్‌గా సుమారు పాతిక సంవత్సరాల పాటు పని చేసిన అరుణా మిల్లర్,   ఆ తర్వాత  రాజకీయ రంగప్రవేశం చేశారు. మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో సభ్యురాలిగా సేవలందించిన ఆమె, రాష్ట్రస్థాయి ఎన్నికల్లో పోటీ చేసి మేరీల్యాండ్ చరిత్రలోనే తొలి   తొలి వలసదారు లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా  పదవిని అధిష్టించి రికార్డు సృష్టించారు.

గతంలో ఆమె తొలిసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు పవిత్ర భగవద్గీతను స్పృశించి ప్రమాణ స్వీకారం చేయడం అప్పట్లో  అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె తన మొదటి హయాంలో రాష్ట్రంలో రవాణా రంగ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, శ్రామిక కుటుంబాల సంక్షేమం,  ఆర్థిక వృద్ధికి ప్రత్యేక కృషి చేశారు. ప్రజలకు ఆమె అందించిన నిరంతర సేవలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలే ఆమెకు రెండోసారి విజయాన్ని కట్టబెట్టాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఈ ఎన్నికల ప్రచార సమయంలో అమెరికాలో నెలకొన్న జాతీయ ఆర్థిక సవాళ్లు, ఫెడరల్ ఉద్యోగాల కోతలు, వలసదారుల సమస్యలు, అలాగే  హెచ్ 1బి  వీసాదారుల అనిశ్చితి వంటి పలు అంశాలపై ఆమె గట్టిగా  గళం విప్పారు. అంతర్జాతీయ విద్యార్థులకు, విదేశీ నిపుణులకు అండగా నిలుస్తామని భరోసా ఇస్తూ ప్రచారం నిర్వహించారు.  


[Aruna Miller elected Maryland Lieutenant Governor, Second Time, Hyderabad Born Aruna Miller,  US Midterm Elections, Telugu Origin  Aruna Mille, Telugu One]