నేడు గరుడ వాహనంపై శ్రీవారు!

తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో  భాగంగా  ఐదవరోజైన నేడు స్వామివారు  గరుడ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగనున్నారు.  గరుడ సేవను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు.   గ్యాలరీల్లో రెండు లక్షల మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.  గరుడ వాహనంపై మలయప్పను వీక్షించేందుకు 28 భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గరుడ వాహన సేవలో ఎలాంటి భద్రతా సమస్యలు తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu