సీతానగరం పుష్కరఘాట్ల వద్ద వలసకార్మికులను ఆదుకొనేదెవరు?

తాడేపల్లి మండల పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద నిత్యం 200 మందికి పైగా వలసకార్మికులు ,యాచకులు దయనీయ స్థితిలో నివసిస్తున్నారు. వివిధ సేవాసంస్థలు అందించిన ఆహరం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు .ఆవాసం లేక ఎండలో మాడుతూ, దోమలతో సావాసం .. హృదయవిధాకారంగా జీవనం కొనసాగిస్తున్నారు.  ఆదుకోవాలంటూ కృష్ణమ్మ వైపు దిక్కులు చూస్తున్న వారికోసం తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లాక్ డౌన్ పూర్తయ్యేవరకు వారికి భోజనసదుపాయం తో పాటు వసతి కల్పించాలని వలస కార్మికులు కోరుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu