లిక్కర్ స్కాంలో అతనిదే ప్రధాన పాత్ర.. సాయిరెడ్డి సంచలన విషయాలు

 

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కేసులో  మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ స్కాంలో సాక్షిగా హాజరు కావాలని సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేయగా.. నేడు సిట్ ముందుకు వచ్చారు. శుక్రవారం విజయవాడ సిట్ ఆఫీసులో ఈ విచారణ జరుగుతోంది.

ఈ కుంభకోణంలో మెయిన్ రోల్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిదే అని విజయసాయి పేర్కొనగా.. అదే ఆఫీసులో వేరేచోట విచారణ జరుపుతున్న కసిరెడ్డి తండ్రిని విజయసాయి సమాధానాలను బేస్ చేసుకొని ప్రశ్నలు ఆడుగుతున్నట్టు సమాచారం.కాగా విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. నిన్న విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు సమాచారం పంపిన ఆయన... కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. ఈరోజు విజయవాడలోని సిట్ కార్యాలయానికి ఆయన వచ్చారు. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది.