ప్రపంచంలోనే పెద్ద ఉల్లిపాయ ఇదిగో...

 

ప్రపంచంలోనే పెద్ద ఉల్లిపాయని ఇంగ్లండ్‌లో ఓ రైతు పండించాడు. ఆ రైతు పండించిన ఉల్లిపాయ బరువు ఎంతంటే... ఎనిమిది కిలోలు. ఇంగ్లండ్‌లోని సౌత్ డెర్బీషైర్ మోరిరా నగరంలో టోనీ గ్లోవర్ అనే రైతు తన తోటలో ఈ ఉల్లిపాయను పెంచాడు. ప్రపంచంలోనే అతి పెద్ద ఉల్లిపాయగా ఈ స్పెషల్ ఉల్లిపాయ గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. ఈ ఉల్లిపాయ చుట్టుకొలత 32 ఇంచ్‌లు. పెద్దపెద్ద ఉల్లిపాయలను పండించడం గ్లోవర్ వంశానికి అలవాటు అట. ఈయనగారి తాత, తండ్రి కూడా పెద్దపెద్ద ఉల్లిపాయలను పండిచండంలో సిద్ధహస్తులట. ఇప్పుడు ఈయన కూడా అతి పెద్ద ఉల్లిపాయని పండించి గిన్నిస్ రికార్డు సృష్టించాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu