ప్రముఖ నాస్తికవాది లవణం మృతి
posted on Aug 14, 2015 12:29PM

ప్రముఖ నాస్తికవాది, సంఘసేవకుడు గోపరాజు లవణం ఈరోజు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన విజయవాడలోని రమేష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందారు. ఆయన వయస్సు 86 యేళ్లు.
లవణం హేతువాదం, నాస్తికవాదంపై అనేక గ్రంథాలను రచించారు. సంఘం, ది ఎథిస్ట్, నాస్తిక మార్గం పత్రికలు లవణం సంపాదకీయంలో వెలువడ్డాయి. చిన్నతనంలోనే స్వాతంత్ర్యం ఉద్యమంలో పాల్గొని.. 1973లో విజయవాడ హేతువాద సంఘ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అస్పృశ్యత, కుల నిర్మూలన కోసం తీవ్రంగా కృషి చేశారు. ప్రముఖ రచయిత గుర్రం జాషువా కుమార్తె హేమలతను లవణం వివాహం చేసుకున్నారు.
కాగా లవణం మృతికి సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు లవణం మృతదేహాన్ని బెంచిసర్కిల్‌లోని నాస్తిక్ కేంద్రానికి తరలించి ఈ రోజు సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్ధం భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.