ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు..చిరు డౌన్..డౌన్
posted on Jan 8, 2014 9:04AM

తెలుగు నటుడు ఉదయ్ కిరణ్ బౌతికకాయానికి అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం ఎర్రగడ్డ స్మశానవాటికలో పూర్తయ్యాయి. తన అభిమాన నటుడిని చివరిసారిగా చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సంధర్బంగా మెగాస్టార్ చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిరు డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ కు అవకాశాలు రాకుండా చిరు అడ్డుకున్నారని ఆరోపణలు చేశారు. అంతకుముందు ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.
ఉదయ్ కిరణ్ ఆత్మహత్య విషయమై వెస్ట్ జోన్ డీసీపీ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ....టీం ఆఫ్ డాక్టర్స్ ఉదయ్ కిరణ్‌ది ఆత్మహత్యే అని ప్రాథమికంగా తేల్చారని తెలిపారు. ఉరి వేసుకోవడం ద్వారా మరణించినట్లు తేలిందన్నారు. తాము పూర్తి స్థాయి నివేదిక పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు.