లక్ష్మీ పార్వతి వైసీపీకి ప్లస్సా మైనస్సా?
posted on Sep 10, 2022 12:11PM
సమైక్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సతీమణి నందమూరి లక్ష్మీపార్వతికి రాజకీయా లు, సాహిత్యం రెండూ ప్రత్యేకాంశాలు. సాహిత్యసభలు, సమావేశాల్లో ఆమె రాజకీయాల గురించి ప్రస్తా విం చరు. రాజకీయ వేదికల మీద సాహిత్యం గురించి ప్రస్తావించరు. 1996 నుంచి 99 వరకూ పాత పట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఆ తర్వాత మళ్లీ పోటీ చేసినపుడు ఆమె అదే నియోజకవర్గం నుంచి పరాజయం పాలయ్యారు. దాంతో క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అయితే 2014 ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆమె జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలోకి వెళ్లారు. అప్పటికే టీడీపీ, చంద్రబాబు నాయుడు మీద ఆమె ఆగ్రహం అనేక వేదికల మీద వ్యక్తం చేస్తువస్తున్నారు. వైసీపీ పంచన చేరినప్పటి నుంచి అందుకు రెండింతలు విమర్శలతో విరుచుకుపడుతూ వచ్చారు.
టీడీపీ అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం వెనుక చాలా కుట్రలు జరిగాయని లక్ష్మీ పార్వతి చేసిన ఆరోపణలు వైసీపీకి అప్పట్లో టీడీపీపై విరుచుకుపడేందుకు అస్త్రాలుగా మారాయి. క్రమేపీ ఆమె జగన్ కు అభిమానపాత్రురాలయ్యారు. దాంతో తెలుగు అకాడమీ ఛైర్మన్ పదవి దక్కింది. అప్పటి నుంచీ వీలు దొరికినపుడల్లా టీడీపీ మీద ఆమె విమర్శల వాగ్బాణాలు సంధిస్తూనే ఉన్నారు. లక్ష్మీపార్వతి చేస్తున్న ఆరో పణల్లో పస ఎంత అనేది వైసీపీ నాయకులు అంచనా వేశారో లేదో తెలీదు గాని ఆమె గట్టిగా వాదించ డం, చంద్రబాబు మీద తీవ్ర ఆగ్రహంతో రగిలిపోవడాన్ని జగన్ తమకు అనుకూలించే విధంగా మార్చుకునే యత్నాలు చేశారు.
అయితే క్రమేపీ ఆమె వాక్చాతుర్యం, ఆరోపణలు ఏవీ కూడా వైసీపీకి పెద్దగా ఉపయోగ పడే విధంగా లేవన్నది వైసీపీ నాయకులు గమనించారన్నది విశ్లేషకుల మాట. ఆమె ప్రతీ మాట,ప్రతి విమర్శా కేవలం ఎ చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ఉంది తప్ప టీడీపీని ఇరుకున పెట్టే పదునయిన బాణాల్లా ఎంత మాత్రం లేవు. దీంతో జగన్‌తో పాటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు లక్ష్మీపార్వతిని కేవలం ‘గౌరవ’ పాత్రకే పరిమితం చేసేశారు. కాలం మారుతున్నా, జగన్ ప్రభుత్వం మీద విమర్శలు, వ్యతిరేకత వెల్లువెత్తుతున్నా, లక్ష్మీపార్వతి మాత్రం చంద్రబాబు నామ స్మరణ మానలేదు. కొంత కాలం క్రితం చంద్రబాబు ఆస్తుల వివరాలు వెల్లడించాలంటూ కోర్టు మెట్టెక్కారు. కోర్టు కేసు కొట్టేసింది. దీంతో సుప్రీం మెట్టెక్కారు. విచారణల అనంతరం సుప్రీం కోర్టు అసలు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తులను ప్రశ్నించడానికి లక్ష్మీపార్వతి అర్హత ఏమిటని ప్రశ్నించింది. ఆమెకు బాబు ఆస్తుల గురించి అడిగే అధి కారం, చట్టపరంగా హక్కూ లేదని కరాఖండీగా సుప్రీం చెప్పింది.
నిత్యం బాబు జపంతో కాలంగడుపుతున్న లక్ష్మీపార్వతికి సుప్రీం మొట్టికాయల వల్ల వైసీపీ ప్రభుత్వానికి కూడా ఎదురుదెబ్బ తగిలిందనడంలో సందేహం లేదు. లక్ష్మీ పార్వతి చంద్రబాబుపై సంధిస్తున్న విమర్శల వల్ల వైసీపీకి ఎటువంటి ప్రయోజనం చేకూరకపోవడం అటుంచి, నష్టం కూడా వాటిల్లుతోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.